మనోజ్ విడాకుల నిర్ణయం.. నా తమ్ముడికి ఆ ఒక్క మాట చెప్పా: మంచు విష్ణు

Published : Mar 27, 2020, 09:18 PM ISTUpdated : Mar 27, 2020, 09:56 PM IST
మనోజ్ విడాకుల నిర్ణయం.. నా తమ్ముడికి ఆ ఒక్క మాట చెప్పా: మంచు విష్ణు

సారాంశం

తన విలక్షణ నటనతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఖ్యాతిని పొందారు. ఆయన తనయులుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా నటులుగా గుర్తింపు పొందారు.

తన విలక్షణ నటనతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఖ్యాతిని పొందారు. ఆయన తనయులుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా నటులుగా గుర్తింపు పొందారు. కానీ వీరిద్దరికి సక్సెస్ రేట్ అంతగాలేదు. 

అప్పుడప్పుడూ కొన్ని విజయాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 

మంచు మనోజ్ తన భార్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విభేదాల కారణంగా ప్రణతి రెడ్డితో మనోజ్ విడాకులు పొందాడు. ఆ టైం పీరియడ్ లో తాను డిప్రెషన్ లో ఉన్నట్లు కూడా మనోజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తన తమ్ముడి వ్యక్తిగత జీవితం గురించి విష్ణు  స్పందించాడు. 

విడాకుల తర్వాత నా తమ్ముడికి నేను ఒకే ఒక్క మాట చెప్పా. 'టేక్ యువర్ ఓన్ టైం' అని చెప్పా. ఎందుకంటే లైఫ్ చేంజింగ్ డెసిషన్ తర్వాత ఎవరైనా కన్ఫ్యూషన్ లో, డిప్రెషన్ లో ఉండడం సహజం. అలాంటి టైం లో మరో నిర్ణయం తీసుకుంటే తప్పటడుగు వేసినట్లు అవుతుంది. అందుకే మనోజ్ కి కొంత టైం తీసుకోమని చెప్పా. ఎలాంటి గాయానికైనా కాలమే మందు అని విష్ణు తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?