కరోనా ఎఫెక్ట్‌ : సాధారణ గృహిణిగా మారిన నటి, ఎంపీ

Published : Mar 28, 2020, 10:03 AM IST
కరోనా ఎఫెక్ట్‌ : సాధారణ గృహిణిగా మారిన నటి, ఎంపీ

సారాంశం

సినీ నటి, ఎంపీ మిమీ చక్రవర్తి ఇంటి పనుల్లో బిజీ అయ్యింది. ఇటీవల లండన్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చిన ఆమె 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండిపోయింది. ఈ లోగా ప్రధాని లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఆమె ఇంటి పనుల్లో బిజీ అయిపోయింది.

కరోనా భయంతో ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉంది. మహమ్మారి భయంతో సాధారణ ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బిజీ బిజీ జీవితాల్లో ఉండే ప్రముఖులు ఇప్పుటు ఇంటిపట్టున ఉండే సమయం దొరకటంతో ఇంటి పనులను చక్కపెట్టేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 రోజుల పాటు సెలవులు రావటంతో నటి, ఎంపీ స్థాయి వారు కూడా ఇప్పుడు మామూలు వ్యక్తులుగా మారిపోయారు.

సినీ నటి, ఎంపీ మిమీ చక్రవర్తి ఇంటి పనుల్లో బిజీ అయ్యింది. ఇటీవల లండన్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చిన ఆమె 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండిపోయింది. ఈ లోగా ప్రధాని లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఆమె ఇంటి పనుల్లో బిజీ అయిపోయింది. ఈ సమయంలో ఆమె వంటగదిలో బిజీగా ఉన్న దృశ్యాలను ఫోటో తీసి తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానులతో పంచుకున్నారు. మిమీ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మిమీ చక్రవర్తి ప్రొఫెనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే 2011లో రూపొందిన గానేర్‌ ఒపారీ అనే టీవీ షో గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తరువాత ఛాంపియన్‌, బాపి బారిజా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. లాక్‌ డౌన్‌ సమయంలో తారలు అంతా వర్క్‌ అవుట్స్, పెయింటింగ్స్ లతో బిజీ అవుతుంటే మిమీ కూడా అదే లిస్ట్ లో చేరారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?