మహేష్ vs బన్నీ.. కళ్యాణ్ రామ్ కొట్టేలా ఉన్నాడు!

prashanth musti   | Asianet News
Published : Jan 06, 2020, 02:31 PM IST
మహేష్ vs బన్నీ.. కళ్యాణ్ రామ్ కొట్టేలా ఉన్నాడు!

సారాంశం

హేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు  జనవరి 11. 12వ తేదీలలో రిలీజ్ కాబోతున్నాయి.  ఈ రెండు సినిమాలో యాక్షన్ డోస్ హెవీగా ఉండడంతో సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. ఇక జనవరి 15న రాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది

సంక్రాంతి సీజన్ లో మంచి సక్సెస్ అందుకోవాలని ఎవరికీ వారు సినిమాల ప్రమోషన్స్ తో తెగ కష్టపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు డిఫరెంట్ సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు  జనవరి 11. 12వ తేదీలలో రిలీజ్ కాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలో యాక్షన్ డోస్ హెవీగా ఉండడంతో సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. ఇక జనవరి 15న రాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అయితే బన్నీ - మహేష్ సినిమాల కంటే తమ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్లుగా ఎంత మంచివాడవురా టీమ్ ప్రమోషన్స్ చేస్తోంది.

ఇక సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ ని ఇచ్చింది.  చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఓ వర్గం ఆడియెన్స్ ఆకర్షిస్తున్నట్లు అర్ధమవుతోంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆడియెన్స్ ఒక్కసారిగా ఈ మంచి సినిమాకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది.

స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

శతమానం భవతి వంటి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు ఇంతవరకు పెద్దగా బజ్ లేదు.. ఇప్పుడిపుడే ప్యూర్ ఫ్యామిలి సినిమా అనే ప్రచారం వైరల్ అవుతోంది. మరి ఈ భారీ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో కళ్యాణ్ రామ్ ఎంతవరకు వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?