విచారణ జరపకపోతే ఊరుకోం.. జీవితారాజశేఖర్ ఫైర్!

By AN TeluguFirst Published Jan 6, 2020, 2:04 PM IST
Highlights

ఈ విషయంలో రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల మా డైరీ ఆవిష్కరణ సభలో రాజశేఖర్, చిరంజీవిల మధ్య వాగ్వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అయితే రాజశేఖర్ తన వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేయలేదని.. 'మా' అధ్యక్షుడు నరేష్ వైఖరి నచ్చకే ఆయన రాజీనామా చేశారని ఆయన భార్య 'మా' సభ్యురాలు జీవితా చెప్పుకొచ్చింది. నరేష్ వ్యవహారంపై రాజశేఖర్ రాజీనామా లేఖలో ప్రస్తావించారని.. ఆరోపణలు నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అన్నారు.

స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

నరేష్ ప్రవర్తన నగురించి పలుసార్లు బహిరంగంగా మాట్లాడినా చర్యలు తీసుకోలేదని అన్నారు. మా కమిటీ సభ్యులకు నరేష్ ప్రవర్తనపై అభ్యంతరాలున్నాయని చెప్పారు. నరేష్ పై చాలానే కంప్లైంట్స్ ఉన్నాయని.. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత మాట్లాడతామని అన్నారు.

'మా' క్రమశిక్షణ కమిటీ వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని.. క్రమశిక్షణ కమిటీ విచారణ జరపకపోతే ఊరుకోమని అన్నారు. సీనియర్ నటులతో రాజశేఖర్ కి ఎలాంటి విభేదాలు లేవని.. నరేష్ తో మాత్రమే మాకు ఇబ్బందని చెప్పుకొచ్చారు. 

click me!