విజయ్‌పై ఐటీ రైడ్స్.. నిర్మాత కూతురే కారణమా..?

By AN TeluguFirst Published Feb 8, 2020, 12:20 PM IST
Highlights

విజయ్ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన్ని టార్గెట్ చేశారని.. రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలు చేసే ధైర్యం లేక సెలబ్రిటీలపై దాడులు నిర్వహిస్తున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.

గత మూడు రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, బిగిల్ నిర్మాత ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన్ని టార్గెట్ చేశారని.. రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలు చేసే ధైర్యం లేక సెలబ్రిటీలపై దాడులు నిర్వహిస్తున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.

అయితే విజయ్, బిగిల్ నిర్మాత ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడానికి కల్పాత్తి అఘోరా కూతురు అర్చన చేసిన ట్వీటే కారణమని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 'బిగిల్' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్10 చిత్రాల్లో చోటు సంపాదించుకుందని ఆమె ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేసింది.

విలన్ల భార్యలను చూశారా..? మరీ ఇంత అందమా..?

దీంతో ఐటీ అధికారులు కూపీ లాగడం మొదలుపెట్టారట. 'బిగిల్' నిర్మాత, హీరో విజయ్ సమర్పించిన ఐటీ రిటర్న్స్ ఒకసారి పరిశీలించగా.. సినిమాకి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్, నిర్మాత సమర్పించిన రిటర్న్స్ లో రెండూ వేర్వేరుగా ఉండడం గుర్తించారట. దీంతో నిర్మాత కల్పాత్తి అఘోరా నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఆఫీస్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అదే సమయంలో విజయ్ ఇంటిపై కూడా రైడ్స్ చేశారు. 'మాస్టర్' సినిమా షూటింగ్ ని మధ్యలోనే ఆపేసి విజయ్ ని ఐటీ అధికారులు తీసుకెళ్లి విచారించారు. ఆస్తుల వివరాలు, నగదు ఇతర విషయాలపై లెక్కలు తీసుకున్నారు. అంతేకాకుండా ఏజీఎస్ ఆఫీస్, నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహించగా.. డబ్బు కట్టల బ్యాగ్ లు కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం, వెండి బయటపడ్డాయి.

500 కోట్లు విలువ చేసే డాక్యూమెంట్స్ కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారం, డబ్బు అనెనే విలువ కట్టి చూడగా.. దాదాపు మూడు వందల కోట్లు పన్ను ఎగవేసినట్లుగా అధికారులు ఓ అంచనాకి వచ్చారు. మరోవైపు విజయ్ కూడా సుమారు 100 కోట్లు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందుతోంది. 
 

click me!