ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 4.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3.77 షేర్ వచ్చింది. అయితే థియోటర్స్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.
గతంలో తను యాక్షన్ సినిమాలు చేసినా వర్కవుట్ కాకపోవటంతో గ్యాప్ ఇచ్చి, ఈ సారి సొంతంగానే తన ప్రయత్నం చేసాడు. యంగ్ హీరో నాగ శౌర్య . తనే కథ రాసుకుని మరీ యాక్షన్ జోనర్ లోకి వెళ్లి నటించిన సినిమా అశ్వద్ధామ. క్రిందటి శుక్రవారం విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి రేటింగ్స్ తెచ్చుకుంది.
ఈ మధ్యకాలంలో వరస పెట్టి అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ గా నటన,క్యారక్టరైజేషన్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే కలెక్షన్స్ మాత్రం టాక్ వచ్చిన స్దాయిలో మాత్రం లేవు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 4.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3.77 షేర్ వచ్చింది. అయితే థియోటర్స్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఏరియా వైజ్ కలెక్షన్స్ బ్రేకప్ చేస్తే...
ఏరియా కలెక్షన్స్
నైజాం............... రూ. 1.45 కోట్లు
సీడెడ్................. రూ. 46 లక్షలు
గుంటూరు........... రూ. 26 లక్షలు
ఉత్తరాంధ్ర.......... రూ. 66 లక్షలు
ఈస్ట్ గోదావరి....... రూ. 28 లక్షలు
వెస్ట్ గోదావరి........ రూ. 22 లక్షలు
కృష్ణ..................... రూ. 29 లక్షలు
నెల్లూరు............... రూ. 15 లక్షలు
ఆంధ్ర& తెలంగాణా.. రూ. 3.77 కోట్లు
కర్ణాటక+దేశంలో మిగతా ప్రాంతాలు............ రూ. 28 లక్షలు
ఓవర్ సీస్...............రూ. 55 లక్షలు..
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్......... 4.6 కోట్లు
విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు అన్నది బేసిక్ పాయింట్. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ క్రైమ్ డ్రామా. హీరో నాగశౌర్యని సైతం ఇంతవరకు ఏ దర్శకుడూ చూపని రీతిలో చాలా ఫెరోషియస్ గా చూపటంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. నాగ శౌర్య రెండేళ్లు కష్టపడి మనసు పెట్టి ఈ కథను రాసానని చెప్తున్నారు.
ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు. ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి.