మీనా, ఖుష్బూతో స్టార్ హీరో రొమాన్స్.. తప్పుకున్న జ్యోతిక, కీర్తి సురేష్?

Published : Nov 28, 2019, 06:26 PM IST
మీనా, ఖుష్బూతో స్టార్ హీరో రొమాన్స్.. తప్పుకున్న జ్యోతిక, కీర్తి సురేష్?

సారాంశం

డైరెక్టర్ శివ తమిళంలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. శివ వరుసగా అజిత్ తో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరం, వేదలమ్, వివేకం, విశ్వాసం లాంటి చిత్రాలు శివ దర్శత్వంలో వచ్చినవే.

డైరెక్టర్ శివ తమిళంలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. శివ వరుసగా అజిత్ తో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరం, వేదలమ్, వివేకం, విశ్వాసం లాంటి చిత్రాలు శివ దర్శత్వంలో వచ్చినవే. ప్రస్తుతం శివ ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 

రజనీకాంత్ 168వ చిత్రం శివ దర్శత్వంలోనే తెరకెక్కబోతోంది. ప్రస్తుతం రజనీ దర్బార్ చిత్రంలో మురుగదాస్ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. దర్బార్ విడుదల కాగానే ఈ రజని, శివ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

బాబు, పవన్, లోకేష్ పాత్రలతో వర్మ ఐటెం సాంగ్.. శకుని కూడా షాకైపోతాడు

ప్రస్తుతం శివ ఈ చిత్రానికి నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన కథతోనే శివ ఏ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కథలో పరంగా ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్లు నటించాల్సి ఉంది. దీనితో దర్శకుడు శివ.. జ్యోతిక, మంజు వారియర్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు. 

కానీ వారెవరూ ఈ చిత్రం పట్ల ఆససక్తి చూపలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనా, ఖుష్బూ లకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. మీనా, ఖుష్బూ ఇద్దరూ గతంలో రజనీకాంత్ సరసన నటించారు. సీనియర్ హీరోయిన్లతో రజనీ రొమాన్స్ చేయనుండడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

అల్లు ఫ్యామిలీ వాడకం మామూలుగా లేదుగా.. ఈసారి వరుణ్ తేజ్! 

విశ్వాసం చిత్రాన్ని శివ తెరకెక్కించిన విధానానికి మెచ్చి రజని ఈ అవకాశం ఇచ్చారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఇమాం సంగీతం అందించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?