ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలనుంది.. రజినీకాంత్ కామెంట్స్!

Published : Dec 17, 2019, 01:03 PM ISTUpdated : Dec 17, 2019, 01:22 PM IST
ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలనుంది.. రజినీకాంత్ కామెంట్స్!

సారాంశం

తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్, విలన్ గా నటించిన సునీల్ శెట్టి పాల్గొన్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'దర్బార్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్, విలన్ గా నటించిన సునీల్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.

హీరోయిన్ గొంతెమ్మ కోరిక... తలపట్టుకున్న ప్రొడ్యూసర్!

దీనిపై ఆయన మాట్లాడుతూ.. తనకు పోలీస్ పాత్రలు చేయడం నచ్చదని.. అలాంటి పాత్ర చేయాలంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. తనకు సులభంగా చేసే పాత్రలంటే ఇష్టం కానీ మురుగదాస్ వైవిధ్యమైన కథతో తన దగ్గరకి రావడంతో ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు చాలా జోనర్స్ లో సినిమాలు చేసినట్లు చెప్పిన రజినీకాంత్ తన డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయానని అన్నారు.

దాదాపు 160 సినిమాలు చేశానని, 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయానని అన్నారు. ఇంతకీ రజినీ డ్రీం రోల్ ఏంటో తెలుసా.. ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ అంట.. వెండితెరపై ట్రాన్స్‌జెండర్ గా కనిపించాలనేది తన కోరిక అని చెప్పారు. ఇక 'దర్బార్' ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'I am a Bad cop' అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?