మొన్న ప్రభాస్.. నిన్న మహేష్.. ఇప్పుడు కాజల్

prashanth musti   | Asianet News
Published : Dec 17, 2019, 12:53 PM ISTUpdated : Dec 17, 2019, 01:00 PM IST
మొన్న ప్రభాస్.. నిన్న మహేష్.. ఇప్పుడు కాజల్

సారాంశం

లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి 12ఏళ్లవుతోంది. 

లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి 12ఏళ్లవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది.

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

అసలు మ్యాటర్ లోకి వెళితే.. అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. సెలబ్రెటీల రూపాలను మైనపు బొమ్మలుగా చేసి ప్రాణం తప్ప అన్ని ఛాయలు కనిపించేలా చేసే మేడమ్ టుస్సాడ్స్ ఇప్పటికే ఎంతో మంది భారత సెలబ్రటీల బొమ్మలను ప్రజెంట్ చేసింది.

టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు - ప్రభాస్ మైనపు బొమ్మలను తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్ ఇప్పుడు కాజల్ అగర్వాల్ బొమ్మను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

నిర్వాహకులు కాజల్ నుంచి కొలతలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాజల్ చివరగా తెలుగులో రణరంగం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?