నెటిజన్ కి సారీ చెప్పిన మంచు మనోజ్.. కారణమేంటంటే..?

Published : Feb 12, 2020, 10:07 AM IST
నెటిజన్ కి సారీ చెప్పిన మంచు మనోజ్.. కారణమేంటంటే..?

సారాంశం

ఇటీవల తన పెళ్లి బ్రేకప్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు వెల్లడించాడు. ఆ తరువాత గత నెల 28న.. తన నుండి ఆసక్తికర అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పాడు మనోజ్. ఆ సమయంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. 

మంచు మనోజ్ తాజాగా ఓ నెటిజన్ ని క్షమాపణలు కోరారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను అపుడప్పుడు షేర్ చేసుకుంటూనే.. ఇతర సినిమాలపై కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఇటీవల తన పెళ్లి బ్రేకప్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు వెల్లడించాడు. ఆ తరువాత గత నెల 28న.. తన నుండి ఆసక్తికర అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పాడు మనోజ్. ఆ సమయంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. మళ్లీ పెళ్లా..? అంటూ మనోజ్ ని ఏడిపించారు.

'ఏంటి.. ఇంకో పెళ్లా..?' మనోజ్ పోస్ట్ పై సెటైర్లు!

అది చూసిన మనోజ్.. 'వామ్మో..' అంటూ దండాలు పెట్టేశాడు. దీంతో పెళ్లి విషయం కాదనే విషయం కాదని క్లారిటీ వచ్చింది. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తరువాత మనోజ్ నుండి మరో సినిమా రాలేదు. దీంతో సినిమాకి సంబంధించిన అప్డేట్ అయినా ఇస్తాడనుకుంటే ఇప్పటివరకు అదీ లేదు.

ఇంకా అప్డేట్ రాకపోవడంతో మంచు మనోజ్ ని ట్యాగ్ చేస్తూ.. 'వీక్ టైం అంటే 20 లేదా 30 వారాల తరువాతా అన్నా.. త్వరగా చెప్పు అన్నా' అంటూ ఓ నెటిజన్ మనోజ్ ని నిలదీశాడు. ఇది చూసిన సారీ తమ్ముడూ.. ఇంకొంచెం టైం వెయిటింగ్ అంతే అంటూ చెప్పుకొచ్చాడు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?