పవన్ క్రిష్ కాంబో.. అదిరిపోయే టైటిల్!

prashanth musti   | Asianet News
Published : Feb 12, 2020, 07:56 AM IST
పవన్ క్రిష్ కాంబో.. అదిరిపోయే టైటిల్!

సారాంశం

వన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా వరుసగా 5 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మొదట వకీల్ సాబ్ అంటూ పింక్ రీమేక్ తో రాబోతున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా వరుసగా 5 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మొదట వకీల్ సాబ్ అంటూ పింక్ రీమేక్ తో రాబోతున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అనంతరం హరీష్ శంకర్ తో పాటు మరో ఇద్దరు దర్శకుల కథలను కూడా లాక్ చేసి ఉంచారని తెలుస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు మంచి టైటిల్ సెట్టయినట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా 'విరూపాక్షి' అనే టైటిల్ ని సెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తెలుగు వాళ్లకి తెలియని ఒక తెలంగాణ రాబిన్ హుడ్ కథను పవన్ ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

'పండుగల సాయన్న' అనే ఒక యోధుడి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాబిన్ హుడ్ అని పిలవబడే ఈ యోధుడి కథపై ఇప్పటికే ఇంటర్నెట్ లో సెర్చ్ లు మొదలయ్యాయి. పెదవాళ్ళ ఆకలి కడుపులను పసిగట్టి రాజుల నుంచి దోచుకున్న ఆహారాన్ని వారికి పంచేవాడట. ఉన్నవాళ్ళ నుంచి దోచుకున్న సంపదను లేనోళ్లకి పంచేవారట.  కొన్ని కోటలపై యుద్దాలు కూడా చేశాడని తెలుస్తోంది.

చరిత్రలో అతని కథ ఎక్కడా కనిపించకుండా కనుమరుగవుతున్న తరుణంలో పవన్ మళ్ళీ తన సినిమాతో దేశమంతా తెలిసేలా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ లుక్ పై కూడా టెస్టులు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గడ్డం లేకుండా ఉండటం కూడా ఆ సినిమా కోసమేనని సమాచారం. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?