గబ్బర్ సింగ్ కాంబినేషన్.. ఆ స్టార్ హీరోయిన్ పై హరీష్ కన్ను

Published : Apr 12, 2020, 12:32 PM IST
గబ్బర్ సింగ్ కాంబినేషన్.. ఆ స్టార్ హీరోయిన్ పై హరీష్ కన్ను

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల దాహాన్ని తీర్చిన చిత్రం గబ్బర్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ ఆ చిత్రంలో పవన్ ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల దాహాన్ని తీర్చిన చిత్రం గబ్బర్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ ఆ చిత్రంలో పవన్ ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. అలాంటి గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత మరోసారి పవన్, హరీష్ శంకర్ కాంబోలో మరో చిత్రం రానుంది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. 

హరీష్ శంకర్ ఈ సారి పవన్ తో ఎలాంటి చిత్రం చేయబోతున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా కాజల్ అగర్వాల్ అయితే బావుంటుందని హరీష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కథకు అనుగుణంగా కాజల్ అగర్వాల్ అయితే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని హరీష్ భావిస్తున్నాడట. ఒక వేళ కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఖరారైతే పవన్ తో రెండవసారి రొమాన్స్ చేస్తున్నట్లు అవుతుంది. 

ఉదయ్ కిరణ్ భార్య పారిపోతోంది.. ఆత్మహత్యకు కారణం, సోదరి సంచలన వ్యాఖ్యలు

కాజల్, పవన్ ఇదివరకే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్, విరూపాక్ష చిత్రాల్లో నటిస్తున్నాడు. కరోనా ప్రభావం తగ్గితే వకీల్ సాబ్ చిత్రం విడుదల అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?