నాగార్జున వద్దు ఎన్టీఆరే ముద్దు: బిగ్ బాస్ సీజన్ 1 రీ టెలికాస్ట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్

By Sree sFirst Published Apr 11, 2020, 9:13 PM IST
Highlights

బిగ్ బాస్ టెలికాస్ట్ మొదలయినప్పటినుండి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన వెర్షన్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్ మొదలైన విషయం తెలిసిందే తాజాగా ట్విట్టర్లో ఇది టాప్ ట్రెండ్ గా కొనసాగుతోంది. మాటీవీ కి చేరేంతవరకు వారికి అర్థమయ్యేంతవరకు ఇలా ట్విట్టర్ ట్రెండ్ ని నడిపిస్తామని అన్నారు. 

లాక్ డౌన్ దెబ్బకు సీరియల్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో సీరియల్స్ స్లోత్స్ ఖాళీగా మారాయి. ఈ ప్రైమ్ టైం స్లాట్లను నింపలేక చానళ్ళు బుర్ర బద్దలుకొట్టుకుంటున్నాయి. మా టీవీ ఈ సమస్యకు పరిష్కారంగా బగ్ బాస్ రియాలిటీ షోని టెలికాస్ట్ చేస్తుంది. 

లాస్ట్ సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 ని రీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా బిగ్ బాస్ మూడు సీజన్లలో ఫస్ట్ సీజన్ హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా చేసారని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది. 

బిగ్ బాస్ టెలికాస్ట్ మొదలయినప్పటినుండి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన వెర్షన్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్ మొదలైన విషయం తెలిసిందే తాజాగా ట్విట్టర్లో ఇది టాప్ ట్రెండ్ గా కొనసాగుతోంది. మాటీవీ కి చేరేంతవరకు వారికి అర్థమయ్యేంతవరకు ఇలా ట్విట్టర్ ట్రెండ్ ని నడిపిస్తామని అన్నారు. 

ఇలా కరోనా లాక్ డౌన్ వేళ కూడా మన ప్రజలు మాత్రం తమకు నచ్చిన ప్రోగ్రాములను ప్రసారం చేయాలనీ ఆ హాష్ ట్యాగులను ట్రెండ్ చేయడం మాత్రం కరోనా లాక్ డౌన్ వేళ మంచి టైం పాస్ గా మారింది. 

click me!