George Reddy: ‘జార్జిరెడ్డి’ వివాదాలపై స్పందించిన దర్శకుడు జీవన్ రెడ్డి!

By AN TeluguFirst Published Nov 21, 2019, 3:27 PM IST
Highlights

జార్జిరెడ్డి తన ఆధిపత్యానికి  అడ్డుగా ఉన్న ఏబీవీపీ విద్యార్ధి నాయకులైన ఎంతో మందిని మందిని పొట్టనపెట్టుకున్నాడనే  ఆరోపణలున్నాయంటూ కొందరు వివాదం చేస్తున్నారు.  

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా అదే పేరుతో ఓ చిత్రం రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) నటిస్తున్నాడు.

దళం మూవీ ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ..గత కొన్ని రోజులుగా.. జార్జిరెడ్డి సినిమా విడుదలపై పలు వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే.

‘జార్జిరెడ్డి’ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటి..?

 జార్జిరెడ్డి తన ఆధిపత్యానికి  అడ్డుగా ఉన్న ఏబీవీపీ విద్యార్ధి నాయకులైన ఎంతో మందిని మందిని పొట్టనపెట్టుకున్నాడనే  ఆరోపణలున్నాయంటూ కొందరు వివాదం చేస్తున్నారు.  ఈ సినిమా విషయమై ఎమ్మెల్యే రాజా సింగ్ ‘జార్జి రెడ్డి’చిత్రంపై స్పందించారు. ఈ సినిమాను వాస్తవాలను వక్రీకరించి టోటల్‌గా వన్ సైడ్‌గా తెరకెక్కించినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందన్నారు.

సినిమా ముసుగులో హిందూ సంస్థలపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.  అంతేకాదు ఈ సినిమాను అడ్డుపెట్టుకొని ఏబీవీపీని కించపరిస్తే సహించేది లేదన్నారు. అలా చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు.  ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను కూడా తొలిగించాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేసారు. అసలు ఇలాంటి సినిమాలకు సెన్సార్ వాళ్లు ఎలా అనుమతులు ఇస్తారని మండిపడ్డారు. విమర్శలపై డైరెక్టర్ జీవన్ రెడ్డి స్పందించారు.

జీవన రెడ్డి మాట్లాడుతూ.. నా వద్ద ఉన్న వాస్తవాలు, ఆధారాలతో  మాత్రమే జార్జి రెడ్డి సినిమా తీశాను. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే.. జార్జిరెడ్డి తల్లికి చెప్పాలి. రాజాసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. రాజాసింగ్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పారు. రేపటి నుంచి నేను రోడ్లపైనే తిరుగుతానని.. సినిమా చూశాక అందరికీ సమాధానాలు చెప్తానని టీవీ9తో జార్జిరెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.

click me!