'జబర్దస్త్' షో వదిలేసిన నాగబాబు, హైపర్ ఆది, అనసూయ..? క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

Published : Nov 21, 2019, 03:09 PM IST
'జబర్దస్త్' షో వదిలేసిన నాగబాబు, హైపర్ ఆది, అనసూయ..? క్లారిటీ  ఇచ్చిన అదిరే అభి!

సారాంశం

తాజాగా ఈ విషయాలపై స్పందించాడు కమెడియన్ అదిరే అభి. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వస్తుందంటే చాలు.. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటిది ఈ షో ఆగిపోతుందని, కమెడియన్స్ అంతా వేరే ఛానెల్ కి వెళ్ళిపోతున్నారని వార్తలు వచ్చాయి. షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబు ముందుగా బయటకి వెళ్లిపోయారని.. ఇప్పుడు హైపర్ ఆది, సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ తో పాటు యాంకర్ అనసూయ కూడా షోకి దూరమవుతుందని మీడియాలో ప్రచారం జరిగింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించాడు కమెడియన్ అదిరే అభి. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. 'జబర్దస్త్' షో నుండి హైపర్ ఆది వెళ్లిపోతున్నాడనే ప్రచారాన్ని అదిరే అభి ఖండించారు. తనకు తమ్ముడు లాంటివాడైన ఆది.. 'జబర్దస్త్'ని వదిలి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

kamma rajyamlo kadapa reddlu: వర్మపై కేఏ పాల్ పిటిషన్!

'మల్లెమాల సంస్థ' తమకి అన్నం పెట్టిందని.. దాన్ని వదిలి వెళ్లమని.. ఆది బయటకి వెళ్తున్నాడనే విషయంలో నిజం లేదని ఇకముందు కూడా షోలో కొనసాగుతాడని చెప్పారు. అలానే యాంకర్ అనసూయ షోని వదిలేస్తుందనే విషయంలో నిజం లేదని.. ఆమె కూడా షోలో కొనసాగుతారని చెప్పాడు.

ఇక నాగబాబు గురించి మాట్లాడుతూ.. ఆ విషయంపై స్పందించలేనని చెప్పారు. తనది అంత స్థాయి కాదని.. ఆయన బయటకి వెళ్లారంటే అది ఆయనకి సంబంధించిన  విషయమని దానిపై ఎలాంటి కామెంట్స్ చేయలేనని అన్నారు.

'జబర్దస్త్' అనేది ఫ్యామిలీ లాంటిదని.. ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయని.. ఎవరు ఎక్కడ ఉన్న.. ఫ్యామిలీ అంతా ఒక్కటేనని అన్నారు. ఒకరిద్దరు షో నుండి బయటకి వెళ్లినంత మాత్రాన షో ఆగిపోదని.. మునుపటిలానే  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అదే టీఆర్పీ తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?