
హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ వద్ద పవన్ ఫ్యాన్స్ సంద్రంలా చేరిపోయారు. హోరెత్తిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ రోజు పొద్దట్నుంచి ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ పోలీస్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో జోష్ నింపేందుకు కొరియోగ్రాఫర్, డాన్సర్ గణేష్ మాస్టర్ (Ganesh master) చిరు ప్రయత్నం చేశారు. యాంక్ సుమ (Suma) ఆర్ట్ డైరెక్టర్ సూర్య ప్రకాశ్, కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ ను స్టేజ్ పైకి ఆహ్వానించి సినిమాకు పనిచేసిన తమ అనుభూతి తెలియజేయాలని కోరింది.
ఇందుకు సూర్యప్రకాశ్ తన చిత్ర యూనిట్ కు, నిర్మాత నాగ సూర్య వంశీకి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ మాట్లాడే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. కొంత ఎమోషనల్ అవుతూ ‘ఆ దేవుడి.. ఈ దేవుడితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను అద్రుష్టవంతున్ని’ అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ లో ఎనర్జీ లెవల్స్ పెంచేందుకు ‘లాలా భీమ్లా’ సాంగ్ స్టెప్పులేసి అభిమానుల్లో జోష్ పెంచారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.