లక్ష్మీ ఏం చెప్పిందో చూడు.. మోహన్‌ బాబుకు చిరు సలహా

Published : Mar 28, 2020, 11:45 AM IST
లక్ష్మీ ఏం చెప్పిందో చూడు.. మోహన్‌ బాబుకు చిరు సలహా

సారాంశం

చిరు ట్వీటర్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మిత్రమా `వెల్‌కం` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమాధానంగా `కృతజ్ఞతలు మిత్రమా. రాననుకున్నావా.. రాలేననుకున్నావా` అంటూ రిప్లై ఇచ్చాడు చిరు. ఈ సంభాషణ ఈ రోజుకు కూడా ఆసక్తికరంగా కొనసాగింది.

కరోనా భయంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కవమంది తారలు సోషల్‌ మీడియాలోనే అధిక సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సోషల్ మీడియాలోకి స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు చిరు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

చిరు ట్వీటర్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మిత్రమా `వెల్‌కం` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమాధానంగా `కృతజ్ఞతలు మిత్రమా. రాననుకున్నావా.. రాలేననుకున్నావా` అంటూ రిప్లై ఇచ్చాడు చిరు. అయితే వెంటనే స్పందించిన మోహన్ బాబు `ఈ సారి హగ్‌ చేసుకున్నప్పుడు చెప్తా` అంటూ సమాధానమిచ్చాడు. ఈ ట్వీట్ కు మరోసారి రిప్లై ఇచ్చాడు చిరు `మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. నో హగ్స్‌, నో షేక్‌ హ్యాండ్స్‌ ఓన్లీ నమస్తే. సోషల్‌ డిస్టాన్సింగ్ అనేది చాలా  అవసరం. మన సొంత వాళ్లను కాపాడుకోవాడినికి కావాల్సిన ఎవేర్‌నెస్ కోసం మన లక్ష్మీ ప్రసన్న రూపొందించిన వీడియో చూడు` అంటూ ట్వీట్ చేశాడు.

చిరంజీవి, మోహన్ బాబు ల మధ్య చాలా కాలంగా టామ్‌ జెర్రీ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అన్ని వివాదాలు సద్దుమణిగినట్టుగానే కనిపించాను. అవకాశం దొరికిన ప్రతీసారి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?