ఆ ఇంటి మీదా ఓ కన్నేసి ఉంచండి.. బిగ్‌బాస్ రీ టెలికాస్ట్‌!

By Satish ReddyFirst Published Apr 1, 2020, 10:57 AM IST
Highlights

తాజాగా బిగ్ బాస్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్‌ను రీ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా సీరియల్స్‌ షూటింగ్ ఆగిపోవటంతో టెలివిజన్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలు తిరిగి ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి టెలివిజన్ సంస్థలు.

తెలుగు టెలివిజన్ చరిత్రలో సూపర్‌ హిట్ షోలలో ఒకటి బిగ్ బాస్‌. ఎన్టీఆర్‌, నాగార్జున, నానిలాంటి హీరోలు హోస్ట్ చేసిన ఆ షో సూపర్ హిట్ కావటంమే కాదు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. తొలి షోకు ఎన్టీఆర్‌ వ్యాఖ్యతగా వ్యవహరించగా రెండో సీజన్‌కు నాని హోస్ట్ చేశాడు. మూడో సీజన్‌కు నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. ఒక్కో షోకు రేటింగ్, రికార్డులు పెరుగుతూ వచ్చాయి.

అయితే తాజాగా బిగ్ బాస్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్‌ను రీ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా సీరియల్స్‌ షూటింగ్ ఆగిపోవటంతో టెలివిజన్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలు తిరిగి ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి టెలివిజన్ సంస్థలు. అందులో భాగంగానే బిగ్ బాస్‌ సీజన్‌ 3ని తిరిగి ప్రసారం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారం తిరిగి ప్రారంభమైంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేస్తున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ బిగ్‌ బాస్ ను మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. తమిళ వర్షన్‌కు కమల్‌ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తుండగా, హిందీ వర్షన్‌కు సల్మాన్‌ హోస్ట్ చేశాడు.

click me!