కేఏ పాల్ ఎఫెక్ట్: వర్మకి సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు!

By AN TeluguFirst Published Dec 16, 2019, 9:57 AM IST
Highlights

ఇటీవల వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ వివాదం కావడం, ఆ తరువాత పేరు మార్చి 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా ఎన్నో వివాదాలు, వాదనల మధ్య ఈ నెల 12న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. దానికి కారణం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన ఫిర్యాదు అని తెలుస్తోంది. ఇటీవల వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ వివాదం కావడం, ఆ తరువాత పేరు మార్చి 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా ఎన్నో వివాదాలు, వాదనల మధ్య ఈ నెల 12న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ లను పోలిన పాత్రలతో అవహేళన చేశారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ పై స్పెషల్ గా ఓ పాటను కూడా చిత్రీకరించారు.

హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

దీనిపై పాల్ అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. ఆ తరువాత సినిమా విడుదల ఆపాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు, రివైజింగ్ కమిటీలు తుది నిర్ణయం తీసుకోవడంతో సినిమా విడుదలకు మార్గం సులువుగా దొరికింది. అయితే సినిమాలో తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఉపయోగించారని ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో వర్మకి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం నాడు తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు వర్మని ఆదేశించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు వర్మ పోలీసుల ముందు హాజరు కావాల్సివుంది. మొత్తానికి వర్మకి పోలీసుల నుండి తప్పించుకోవడం కుదరలేదు. కానీ ఆయనకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో పోర్న్ సినిమాను తలపించేలా వర్మ తీసిన విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులు వర్మని విచారించారు. 

click me!