రామ్ చరణ్ తో బిగ్ బడ్జెట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్

prashanth musti   | Asianet News
Published : Dec 16, 2019, 08:16 AM ISTUpdated : Dec 16, 2019, 08:31 AM IST
రామ్ చరణ్ తో బిగ్ బడ్జెట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్

సారాంశం

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల కారణంగా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల కారణంగా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రైతు సమస్యలపై పవన్ తనదైన శైలిలో ఒంటరిగా పోరాడుతున్న విషయం తెలిసిందే.  ఇక వచ్చే ఏడాది సరికొత్తగా ఒక సినిమాని చేయడానికి పవన్ ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికే పింక్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవ కళ్యాణ్ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. రామ్ చరణ్ తో ఒక బిగ్ బడ్జెట్ మూవీని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనే చరణ్ తో సినిమా నిర్మిస్తానని చెప్పిన పవన్ రాజకీయాల కారణంగా మళ్ళీ నిర్మాణంపై అడుగులు వేయలేదు.  ఆ మధ్య నితిన్ తో ఒక సినిమాని నిర్మించిన పవన్ కోలుకోలేని దెబ్బ తిన్నాడు.

నిర్మాతగా కొంత ఆదాయాన్ని పెంచుకోవాలని చూసిన పవన్ కి ఛల్ మోహన్ రంగ కాస్త దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు తన అబ్బాయ్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తప్పకుండా చరణ్ తో ఒక సినిమాను నిర్మిస్తానని అందుకు సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

కుదిరితే పవన్ నెక్స్ట్ ఇయర్ లోనే మెగా పవర్ స్టార్ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి చరణ్ తో సినిమా చేస్తానని చెప్పిన పవన్ రాజకీయాలను ఏ మాత్రం విడువని అన్నారు. ఇక పింక్ రీమేక్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి అదే స్పీడ్ లో సినిమాని పూర్తి చేయాలనీ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?