మెగా మూవీకి కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్, జగన్ పై చిరంజీవి ప్రశంసలు!

By tirumala ANFirst Published Mar 15, 2020, 12:05 PM IST
Highlights

కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాయి. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 100 దాటింది.

కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాయి. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి. 

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. ముఖ్యంగా కరోనా ప్రభావం వల్ల ఎంటర్టైన్మెంట్ రంగం తీవ్రంగా దెబ్బ తింటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్స్ ని ప్రభుత్వాలు మూసేశాయి. ఇక దర్శక నిర్మాతలు కూడా తమ చిత్రాల షూటింగ్ ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. 

ఎన్టీఆర్, చరణ్ ఆకాశమే హద్దుగా.. మరొకడు దెబ్బతిన్న పులిలా.. వీళ్ల కోసం ప్రపంచం మొత్తం

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల దర్శత్వంలో తెరక్కుతున్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఎక్కువగా ప్రజలు గుమికూడావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆచార్య చిత్ర షూటింగ్ ని 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా చిరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పై ప్రశంసలు కురిపించారు. 'కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరం. కరోనా నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించదగ్గ విధంగా చర్యలు చేపడుతున్నాయి. 

#PKLove: పూనమ్ కౌర్ మళ్ళీ మొదలు పెట్టిందిగా.. అహంకారం ఎక్కువ అంటూ ట్వీట్

దీనిని కేవలం ప్రభుత్వాల భాద్యత మాత్రమే అని ప్రజలు వదిలేయకూడదు. కరోనాపై ప్రతి ఒక్కరిలో అవగాహన అవసరం. ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం జగన్ కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే నెల్లూరులో, షాపింగ్ మాల్స్, థియేటర్స్, స్కూల్స్ మూసేశారు. ఇకపై కూడా జగన్ కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. 

నా భాద్యతగా నేను కూడా ఆచార్య మూవీ షూటింగ్ ని 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేశాను. నా నిర్ణయాన్ని దర్శకుడు కొరటాల శివకు చెప్పినప్పుడు వెంటనే అంగీకరించాడు. దీని వల్ల ఆర్థికంగా కొంత నష్టం ఉంటుంది. అయినా ఆరోగ్యానికి మించి మరేదీ ఎక్కువ కాదు. సినిమా అంటే వందలాది మంది సిబ్బంది, సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది. అందువల్లే షూటింగ్ వాయిదా వేసినట్లు మెగాస్టార్ చెప్పుకొచ్చారు. 

click me!