రాముడిపై కామెంట్స్.. అడ్డంగా బుక్కైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్!

By tirumala ANFirst Published Feb 10, 2020, 2:21 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు.

వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు. 

అంతఃపురంలో శ్రీరాముడి వైభోగాలపై, ఆహారపు అలవాట్లపై కత్తి మహేష్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. అలాగే బాహ్మణుల గురించి కూడా కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

దీనితో హిందూ సంఘాలు అతడిపై చర్యలకు సిద్ధం అయ్యాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఉమేష్ కుమార్, మరికొందరు హిందూ నాయకులు కత్తి మహేష్ పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణించాలని వారు పోలీసులని కోరారు. 

ఈ కేసులో కత్తి మహేష్ శ్రీరాముడిని దుర్బాషలాడిన ఓ యూట్యూబ్ వీడియో కూడా జత చేశారు. ఉమేష్ కుమార్ తన ఫిర్యాదులో.. కత్తి మహేష్ తన భావప్రకటనా స్వేచ్చని దుర్వినియోగం చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడడం చాలా దారుణమైన అంశం. కత్తి మహేష్ అసత్యాలని ప్రచారం చేయడమే కాక శ్రీరాముడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలు శాంతికి విఘాతంలా అనిపిస్తున్నాయి. 

'కంగ్రాట్స్ రాము తాతయ్య గారు'.. వర్మపై రాజమౌళి సెటైర్లు!

కత్తి మహేష్ చేసిన కామెంట్స్ ని ఫిర్యాదులో నేను పేర్కొనలేకపోతున్నాను. ఎందుకంటే అతడు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. ఉమేష్ కుమార్ ఫిర్యాదుని ఇన్స్పెక్టర్ మోహన్ రావు స్వీకరించారు. 

గతంలో కూడా కత్తి మహేష్ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని వివాదాల కారణంగా అతడిని పోలీసులు కొన్ని రోజుల పాటు నగరం నుంచి బహిష్కరించారు. 

click me!