కరోనా దెబ్బకి.. ముద్దు సీన్లపై బ్యాన్!

By AN TeluguFirst Published Feb 10, 2020, 1:13 PM IST
Highlights

పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి సీరియల్స్ లో కిస్సింగ్ సీన్లు ఉండకూడదని తైవాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలంరేపుతోన్న నేపధ్యంలో తైవాన్ లో రూపొందించే సీరియల్స్ లో కిస్సింగ్ సీన్లను బ్యాన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంది.

ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి సీరియల్స్ లో కిస్సింగ్ సీన్లు ఉండకూడదని తైవాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తైవాన్ లోని టీవీ కళాకారులకు అక్కడి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

విజృంభిస్తున్న కరోనా వైరస్: తొలి అమెరికన్ మృతి

సీరియల్స్ లో కిస్సింగ్ సీన్స్ ఉండకూడదని, కళాకారులు షూటింగ్ సమయంలో దగ్గరగా ఉంటూ మాట్లాడుకోవడానికి వీలులేదని తెలిపింది. కరోనా వైరస్ ప్రభలకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఈ సందర్భంగా టీవీ నటి చీవూ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తైవాన్‌కు చెందిన ఫోర్మోసా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ గోల్డల్ సిటీలో నటి మియా చివూ, నటుడు జూన్ ఫూ మధ్య కిస్సింగ్ సీన్స్ వస్తుంటాయి. ఆ సన్నివేశాల్లో వీరిద్దరూ ఇమిడిపోయి నటిస్తుంటారు. ఇప్పుడు ఆ సన్నివేశాలు బ్రేక్ పడిందనే చెప్పాలి.  
 

click me!