Latest Videos

రెండు కోట్లు నష్టపోయా.. అయినా సమర్ధించను.. కలెక్షన్ల షేరింగ్‌ విషయంలో తగ్గేదెలే అంటోన్న బన్నీవాసు

By Surya PrakashFirst Published May 24, 2024, 6:58 PM IST
Highlights

నైజాంలో ఈ కొత్త షేరింగ్ విధానం అమలైతే థియేటర్స్ మరింతగా ఖాళీ అయిపోతాయని బన్నీ వాస్ అన్నారు. 

రీసెంట్ గా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లకు అనుకున్న విధంగా నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించమని, మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటెజీలు చెల్లించాల్సిందేనని తెలిపారు. లేదంటే సినిమాలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై నిర్మాతలు జులై 1 లోపు ఏ విషయం చెప్పాలని గడువు కూడా ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఈ విషయం చాలా మంది నిర్మాతలకు డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడారు.  గీతా ఆర్ట్స్ 2 నుంచి బన్నీ వాస్ మూవీస్ చేస్తూ ఉంటారు. చిన్న సినిమాలు ఈ కొత్త షేరింగ్ విధానం వలన తీవ్రంగా నష్టపోతారని బన్నీ వాస్  ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ....చిన్న సినిమాలకి మొదటివారంలో వచ్చే మౌత్ టాక్ ద్వారా రెండో వారం నుంచి కలెక్షన్స్ పెరుగుతాయి. సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలకి చాలా వరకు రెండో వారం నుంచి మంచి కలెక్షన్స్ వచ్చి లాభాల బాట పట్టాయి. అయితే కొత్త షేరింగ్ విధానం ద్వారా 70 శాతం కలెక్షన్స్ వాటా డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తీసుకుంటే నిర్మాతలకి ఇక మిగిలేది ఏమీ ఉండదని బన్నీ వాస్ పేర్కొన్నారు. తనకి కూడా థియేటర్స్ ఉన్నాయని ఈ ఐదు నెలల్లో నేను 2 కోట్ల వరకు నష్టపోయాను. 

అయినా కూడా నిర్మాతగా ఈ కొత్త షేరింగ్ విధానాన్ని నేను సమర్ధించను. దీనిపై కౌన్సిల్ లో కచ్చితంగా చర్చిస్తాను. ఈ పద్ధతి వలన భవిష్యత్తులో చిన్న సినిమాల నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్స్ ఫైట్ చేయాల్సింది ఓటీటీ సంస్థలతో, అని బన్నీ వాస్ అన్నారు. ఎనిమిది వారాల నిబంధన కచ్చితంగా అమలు జరిగితే థియేటర్స్ లో సినిమాలకి ఆదరణ పెరుగుతుంది. అయితే కొన్ని సినిమాలని రెండు, మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

 ఓటీటీలో సినిమాల రిలీజ్ టైం పైన కచ్చితంగా పోరాటం చేయాల్సిందే. నైజాంలో ఈ కొత్త షేరింగ్ విధానం అమలైతే థియేటర్స్ మరింతగా ఖాళీ అయిపోతాయని బన్నీ వాస్ అన్నారు. థియేటర్స్ లో కలెక్షన్స్ రావని నిర్మాత డిసైడ్ అయితే ఓటీటీకే మొగ్గు చూపిస్తాడు. అప్పుడు మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. అందుకే మరో సారి డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ కొత్త షేరింగ్ విధానంపై పునరాలోచించాలి అని బన్నీ వాస్ అన్నారు.
 

click me!