Latest Videos

ISL వెర్షన్ లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ఏ ఓటిటిలో అంటే...

By Surya PrakashFirst Published May 23, 2024, 4:31 PM IST
Highlights

సంజ్ఞా భాషలో విడుదలయ్యే తొలి భారతీయ చిత్రమిదే’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.  

 


రవితేజ హీరో గా వచ్చిన  ‘టైగర్‌ నాగేశ్వరరావు’ రిలీజ్ టైమ్ లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓటిటిలో రిలీజ్ చేసారు. అలాగే ఓటిటిలోనూ ఇప్పుడు  ISL (చెవిటి, మూగ వారిభాష)  లో  లభ్యం అవుతున్నట్లు తెలియచేసారు. అమేజాన్ ప్రైమ్ లో ఈ వెర్షన్ అందుబాటులో ఉంది. చూడవచ్చు.

ఇప్పుడీ చిత్రాన్ని సంజ్ఞా భాష (సైన్‌ లాంగ్వేజ్‌)లోనూ విడుదల చేసిన్నట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ను ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సినిమాని ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సంజ్ఞా భాషలోనూ విడుదల చేస్తున్నాం. ఇలా సంజ్ఞా భాషలో విడుదలయ్యే తొలి భారతీయ చిత్రమిదే’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.  ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందించారు. ఆర్‌.మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

1980 ద‌శకంలో తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా  ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ర‌వితేజ యాక్టింగ్‌, ఎన‌ర్జీకి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ పీరియాడిక‌ల్ మూవీలో నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. రేణుదేశాయ్‌, అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ర‌వితేజ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు మిన‌హా మిగిలిన చోట్ల ఈ మూవీ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది.

click me!