తెలంగాణ నిర్భయ.. వైద్యురాలు చేసిన తప్పు అదొక్కటే: హీరోయిన్

By Prashanth MFirst Published Dec 2, 2019, 7:43 AM IST
Highlights

డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ ని హింసించి హతమార్చిన దుండగులను ఏ మాత్రం విడిచిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని సాధారణ జనల నుంచి సెలబ్రెటీల వరకు అందరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సినీ తారలు కూడా తెలంగాణ నిర్భయ ఘటనపై సీరియస్ గా స్పందిస్తున్నారు. 

శంషాబాద్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ ని హింసించి హతమార్చిన దుండగులను ఏ మాత్రం విడిచిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని సాధారణ జనల నుంచి సెలబ్రెటీల వరకు అందరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సినీ తారలు కూడా తెలంగాణ నిర్భయ ఘటనపై సీరియస్ గా స్పందిస్తున్నారు.

రీసెంట్ గా హీరోయిన్స్ రిచా చద్దా కూడా ఘటనపై స్పందించారు. డాక్టర్ చేసిన ఒకే ఒక్క తప్పుగురించి భావోద్వేగంతో వివరణ ఇచ్చారు. ఊహించని విధంగా వారిని దుండగులను నమ్మడమే ఆమె చేసిన తప్పని అన్నారు. ఆ రాత్రి స్కూటీ బాగు చేసి ఇస్తామంటే గుడ్డిగా నమ్మేసింది. నమ్మిన అనంతరం అతి దారుణంగా హింసించి హత్యాచారం చేశారు. మనిషిలా కాకుండా ఒక వస్తువు మాదిరి ప్రవర్తించారు. అమ్మయిలను తప్పుగా పెంచుతున్నామా అనే భావన కలుగుతోంది. డాక్టర్ చేసిన ఒకే ఒక్క తప్పు ఇక్కడ నమ్మడమే అని పేర్కొన్నారు.

read also: ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియాంక హత్య ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమానికిఅతిథిగా హాజరైన సుకుమార్ ప్రియాంక హత్య సంఘటనపై స్పందించారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి. ప్రియాంకని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎవరికైనా కన్నీరు ఆగవు. సంబంధంలేని వారు కూడా ప్రియాంక సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . !

ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తుంటే.. పిల్లలని ఎలా పెంచాలనే భయం వేస్తోంది. క్రిమినల్స్ అందరూ మనలో నుంచే వస్తారు. ఈ సంఘటనకు మనం కూడా ఓ రకంగా భాద్యులమే. మొబైల్, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్ ఎక్కువైపోయాయి. గతంలో సమాజం ఇంత దారుణంగా లేదు. 

ప్రియాంక కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రియాంక 100కి కాల్ చేసి ఉంటే బావుండేది అని అంటున్నారు. నేను కూడా దీని గురించి ఆలోచించా. ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించగా.. ప్రియాంక మాటలు వింటే చాలా సున్నితమైన అమ్మాయి అని తెలుస్తోంది. 

దోషులు మొదట ఆమెకు సాయం చేస్తామని నమ్మించారు. ఒక వేళ నేను 100కి కాల్ చేస్తే.. వాళ్ళు నిజంగానే నాకు సాయం చేసే మనసుతో ఉన్నారేమో.. నీకు సాయం చేయడానికి వస్తే పోలీసులకు అప్పగించావేంటి అని అంటారేమో.. అని ఆ సమయంలో ప్రియాంక అనుకొని ఉంటుంది. 

అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాలం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. 100కి కాల్ చేయాలని అనిపిస్తే చేసేయండి.. తర్వాత సారీ చెప్పొచ్చు. మీరు మమ్మల్ని నమ్మకపోవడమే బెటర్ అని సుకుమార్ వేదికపై వ్యాఖ్యానించారు. 

click me!