వచ్చే వారం బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా కుమార్ సాయి!

Published : Oct 01, 2020, 07:20 PM IST
వచ్చే వారం బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా కుమార్ సాయి!

సారాంశం

అందుతున్న సమాచారం ప్రకారం కుమార్ సాయి వచ్చే వారానికి కెప్టెన్ కానున్నాడని తెలియవస్తుంది. ఈ విషయం శుక్రవారం నాటి ఎపిసోడ్ లో మనకు ప్రసారం చేయబోతున్నారు. 

బిగ్ బాస్ షో అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. తొలుత ఒకింత బోరింగ్ గా షో అనిపించినప్పటికీ... వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌజ్ లో హీట్ పెంచారు నిర్వాహకులు. ముక్కు అవినాష్, స్వాతి దీక్షిత్ కుమార్ సాయిలు ఎంటర్ అవడంతో ఒకింత ఫన్ తోపాటు గ్లామర్ కూడా పెరిగింది. 

ఇక ప్రతివారం బిగ్ బాస్ హౌజ్ లో కెప్టెన్ కి ఉండే స్పెషల్ ప్రివిలేజెస్ మనందరికీ తెలిసిందే. కెప్టెన్ గా ఉన్నవారు నామినేషన్ల ప్రక్రియ నుండి బయటపడతారు అన్న విషయం తెలిసిందే. ఆ ఇమ్మ్యూనిటీతోపాటుగా వారికి హౌజ్ లో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. 

ఇక ఇప్పటికే గంగవ్వ, లాస్య, నోయెల్ కెప్టెన్సీ ని దక్కించుకొని ఆ వరం నామినేషన్ల ప్రక్రియ నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వరం కెప్టెన్ ఎవరవుతారో రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. 

అందుతున్న సమాచారం ప్రకారం కుమార్ సాయి వచ్చే వారానికి కెప్టెన్ కానున్నాడని తెలియవస్తుంది. ఈ విషయం శుక్రవారం నాటి ఎపిసోడ్ లో మనకు ప్రసారం చేయబోతున్నారు. 

హౌజ్ లో కుమార్ సాయి అందరికన్నా వీక్ కంటెస్టెంట్ అంటూ అతడిని తరచు నామినేట్ చేయడం మనం చూస్తూనే ఉంటాము. అలంటి కుమార్ సాయి వచ్చే వారం కెప్టెన్ గా అందరికి చెక్ పెట్టనున్నాడని తెలియవస్తుంది. నామినేషన్ల నుంచి ఇమ్మ్యూనిటి ఉండడంతో మిగిలినవారిపై తన తడాఖా చూపడానికి సిద్ధంగా ఉన్నాడు కుమార్ సాయి. 

అండర్ డాగ్ గా కెప్టెన్సీ టాస్క్ ను చేబట్టిన కుమార్ సాయి అనూహ్యంగా విజయం సాధించాడు. కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన సెకండ్ లెవెల్ నేటి ఎపిసోడ్ లో చూపించబోతున్నట్టుగా తెలియవస్తుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?