justice for disha: దిశ ఘటన.. బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్

By Prashanth MFirst Published Dec 5, 2019, 10:11 AM IST
Highlights

శంషాబాద్ హత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా దిశ మర్డర్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటన పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల జరిగిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా దిశ మర్డర్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటన పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యంత దారుణానానికి పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

అయితే బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలిచినా కౌశల్ కూడా దిశా ఇన్సిడెంట్ పై తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఉరి తీయడమే తగిన పరిష్కారమని అన్నారు. జస్టిస్ దిశ అంటూ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కౌశల్ ఘటన జరిగి ఆరు రోజులు పూర్తయినా నిందితులకు శిక్ష పడలేదని ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని అన్నారు.

తో కలిసి చదువుకున్న 2011 బ్యాచ్ రాజేంద్రనగర్‌ వెటర్నరీ కళాశాల లో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో నటుడు కౌశల్ పాల్గొన్నారు. కొంత సేపటివరకు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక దిశతో కలిసి చదువుకున్న విద్యార్థులు ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.  కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెస ర్‌ డాక్టర్‌ రామ్‌సింగ్‌ తో పాటు వెటర్నరీ పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కాటం శ్రీధర్‌ పాల్గొన్నారు.

read also: దిశ హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమానికిఅతిథిగా హాజరైన సుకుమార్ దిశ హత్య సంఘటనపై స్పందించారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి. దిశని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎవరికైనా కన్నీరు ఆగవు. సంబంధంలేని వారు కూడా దిశ సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . !

ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తుంటే.. పిల్లలని ఎలా పెంచాలనే భయం వేస్తోంది. క్రిమినల్స్ అందరూ మనలో నుంచే వస్తారు. ఈ సంఘటనకు మనం కూడా ఓ రకంగా భాద్యులమే. మొబైల్, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్ ఎక్కువైపోయాయి. గతంలో సమాజం ఇంత దారుణంగా లేదు. 

దిశ కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు దిశ 100కి కాల్ చేసి ఉంటే బావుండేది అని అంటున్నారు. నేను కూడా దీని గురించి ఆలోచించా. ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించగా.. దిశ మాటలు వింటే చాలా సున్నితమైన అమ్మాయి అని తెలుస్తోంది. 

దోషులు మొదట ఆమెకు సాయం చేస్తామని నమ్మించారు. ఒక వేళ నేను 100కి కాల్ చేస్తే.. వాళ్ళు నిజంగానే నాకు సాయం చేసే మనసుతో ఉన్నారేమో.. నీకు సాయం చేయడానికి వస్తే పోలీసులకు అప్పగించావేంటి అని అంటారేమో.. అని ఆ సమయంలో దిశ అనుకొని ఉంటుంది. 

అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాలం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. 100కి కాల్ చేయాలని అనిపిస్తే చేసేయండి.. తర్వాత సారీ చెప్పొచ్చు. మీరు మమ్మల్ని నమ్మకపోవడమే బెటర్ అని సుకుమార్ వేదికపై వ్యాఖ్యానించారు. 

click me!