కోర్టు మెట్లెక్కిన ప్రముఖ లేడీ కమెడియన్!

By AN TeluguFirst Published Jan 27, 2020, 1:02 PM IST
Highlights

తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టివేయాలని, కేసుకి సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీసింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. 

బాలీవుడ్ లేడీ కమెడియన్ భారతీ సింగ్.. పంజాబ్, హర్యానా హైకోర్టుని ఆశ్రయించారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, కమెడియన్ భారతీ సింగ్ లపై అమృత్‌సర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టివేయాలని, కేసుకి సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీసింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

సీనియర్ హీరోయిన్ పై పోలీస్ కేసు..!

భారతీసింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హర్యానా హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరఫు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీసింగ్ లు క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా వివిధ సెక్షన్ల కింద అమృత్‌సర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్‌సర్‌ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టుని ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టకూడదని కోర్టు తెలిపింది. 
 

click me!