అతడు నాపై చెయ్యి వేసి.. ఇంతలో భార్య రావడంతో.. నటి షాకింగ్ కామెంట్స్!

By AN Telugu  |  First Published Jan 13, 2020, 2:25 PM IST

ఈ సందర్భంలో బెంగాలీ దర్శకనిర్మాత అరిందమ్ సిల్ పై సంచలన ఆరోపణలు చేసింది. 'భూమికన్య' సీరియల్ స్క్రిప్ట్ వివరిస్తానని.. ఒకరోజు అరిందమ్ తన ఆఫీస్ కి పిలిస్తే వెళ్లానని ఆమె చెప్పింది. అప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుందని.. ఆఫీస్ లో ఆయన తప్ప ఎవరూ లేరని చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా 'మీటూ' ప్రకంపనలు రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగాలీ చిత్రపరిశ్రమలో కూడా కలకలం రేపుతోంది. బెంగాలీ నటి రూపంజన మిత్ర ఓ దర్శకుడితో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఈ సందర్భంలో బెంగాలీ దర్శకనిర్మాత అరిందమ్ సిల్ పై సంచలన ఆరోపణలు చేసింది. 'భూమికన్య' సీరియల్ స్క్రిప్ట్ వివరిస్తానని.. ఒకరోజు అరిందమ్ తన ఆఫీస్ కి పిలిస్తే వెళ్లానని ఆమె చెప్పింది. అప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుందని.. ఆఫీస్ లో ఆయన తప్ప ఎవరూ లేరని చెప్పుకొచ్చింది.

Latest Videos

మహేష్ కౌగిలింతలో అనిల్ రావిపూడి... సరిలేని ఆనందం!

కూర్చొని స్క్రిప్ట్ వివరిస్తున్న అరిందమ్ కొద్దిసేపటికి మెల్లగా లేచి తన భుజాలపై చెయ్యి వేశాడని ఆమె ఆరోపించింది. మీద చెయ్యి వేసి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. తనకు భయం వేసి వెంటనే కేవలం స్క్రిప్ట్ గురించి వివరిస్తే ఉంటానని.. ఇలాంటివి తనతో కుదరవని అతడితో చెప్పానని వెల్లడించింది.

దీంతో తన గురించి తెలుసుకున్న అరిందమ్ తన స్థానానికి వెళ్లి స్క్రిప్ట్ గురించి చెప్పాడని ఆమె వెల్లడించింది. ఇది జరిగిన ఐదు నిమిషాల్లోనే అతడి భార్య ఆఫీస్ లోకి వచ్చిందని రూపంజన తెలిపింది.

తాను ఆఫీస్ నుండి బయటకి వెళ్లగానే ఎంతో వేదనకి గురైనట్లు.. అప్పట్లో కాంట్రాక్ట్ బాండ్ మీద సంతకం చేయడంతో ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపింది. అయితే రూపంజన చేస్తోన్న ఆరోపణలను అరిందమ్ కొట్టిపారేశాడు. తనపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో అర్ధం కావడం లేదని అన్నారు. 

click me!