తలైవా @69: అప్పుడు చిల్లర లెక్కేసుకున్న శివాజీ.. ఇప్పుడు 400కోట్ల రజిని

By Prashanth MFirst Published Dec 12, 2019, 10:37 AM IST
Highlights

రజినీకాంత్ అంటే తెలియని భారతీయుడు ఉండదు. 40ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ బస్ కండక్టర్ నుంచి బాక్స్ ఆఫీస్ ధీరుడిగా ఎదిగాడు. తలైవా అని అభిమానుల చేత ముద్దుగా  పిలిపించుకునే రజిని నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని భారతీయుడు ఉండదు. 40 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ బస్ కండక్టర్ నుంచి బాక్స్ ఆఫీస్ ధీరుడిగా ఎదిగాడు. తలైవా అని అభిమానుల చేత ముద్దుగా  పిలిపించుకునే రజిని నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన కెరీర్ పై ఓ లుక్కేద్దాం..  వయసు ఎంత పెరిగినా తలైవా అదే ఎనర్జీతో కనిపిస్తున్నారు.

ఏడు పదుల వయసు వచ్చినా రెస్ట్ తీసుకోకుండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. 1949 డిసెంబర్ 12న రజినీకాంత్ ఒక మరాఠి కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించాడు. తల్లి 5 ఏళ్లకె మరణించింది. అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్.  బెంగుళూరులోని రామకృష్ణ మిషన్ స్కూల్లో శివాజీ తన ప్రాథమిక విద్య పూర్తి చేశాడు రజనీ హైస్కూల్‌లో చేరలేదు. టీనేజ్ లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బెంగుళూర్ లోనే ఒక బస్ కండక్టర్ గా కొన్నేళ్ల పాటు జీవితాన్ని కొనసాగించాడు.

అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాలో సెకండ్ హీరోగా బాలా చందర్ మొదటి అవకాశం ఇచ్చారు.  అనంతరం భైరవి సినిమాతో హీరోగా నటించిన రజిని ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని అందుకున్నాడు.

ఒకప్పుడు బస్ కండక్టర్ గా చిల్లర లెక్కేసుకున్న తైలవా కొన్నాళ్లకే బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయల విలువ చేసే హీరోగా ఎదిగాడు.  ఇప్పుడు ఆయన మార్కెట్ 400కోట్లు. కెరీర్ లో బాషా - ముత్తు - అరుణాచలం - నరసింహా - చంద్రముఖి - శివాజీ -రోబో - కబాలి - వంటి ఎన్నో సినిమాలు ఇండియన్ మార్కెట్ ని షేక్ చేశాయి. విదేశాల్లో కూడా రజిని సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎంతవరకు వెళ్లిందో చెప్పవచ్చు.

రజిని సిగరెట్ తాగే స్టైల్ అలాగే నడవడిక అన్నిటికంటే ఆయన మంచి మనసు సూపర్ స్టార్ కీరిటం దక్కేలా చేశాయి. ఇక రాజకీయాల వైపు కూడా తలైవా మెల్లగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ దారిలో సూపర్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

click me!