అఫీషియల్: అనుష్క 'నిశ్శబ్ధం' రిలీజ్ డేట్

prashanth musti   | Asianet News
Published : Feb 08, 2020, 08:56 PM IST
అఫీషియల్: అనుష్క 'నిశ్శబ్ధం' రిలీజ్ డేట్

సారాంశం

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు.

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఏప్రియల్ 2 వ తేదీన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తారు.

ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన చేసారు.   ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం'లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం.   మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గింది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?