ఓటుపై కాంట్రవర్సీ.. నెటిజన్ కామెంట్ కి తాప్సి కౌంటర్

prashanth musti   | Asianet News
Published : Feb 08, 2020, 06:51 PM ISTUpdated : Feb 08, 2020, 06:57 PM IST
ఓటుపై కాంట్రవర్సీ.. నెటిజన్ కామెంట్ కి తాప్సి కౌంటర్

సారాంశం

ముంబైలో ఉంటూ కొంత మంది ఢిల్లీలో ఓటు వేస్తున్నారు. ఇక్కడ ఉండనివాళ్ళు పాలనను ఎలా నిర్ణయిస్తారు? ఇది అవసరమా? అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి హీరోయిన్ తాప్సి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. 

ముంబైలో ఉంటూ కొంత మంది ఢిల్లీలో ఓటు వేస్తున్నారు. ఇక్కడ ఉండనివాళ్ళు పాలనను ఎలా నిర్ణయిస్తారు? ఇది అవసరమా? అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి హీరోయిన్ తాప్సి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతున్న తాప్సి షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకొని తన స్థానిక రాష్ట్రమైన ఢిల్లీ ఎలక్షన్స్ లో ఓటు వేసేందుకు వెళ్లింది.

తన ఫ్యామిలిలో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సొట్టబుగ్గల సుందరి అందుకు సంబందించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది నిమిషాల్లో వైరల్ అయినప్పటికీ కొన్ని భిన్నమైన కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అందులో ఒక కామెంట్ పై తాప్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. తాప్సి ముంబై లో ఉండటాన్ని ఉద్దేశిస్తూ.. ఎక్కడో ఉన్నవాళ్లు ఇక్కడ పాలనపై ఓటు వేసి ఎలా నిర్ణయిస్తారు అని చేసిన కామెంట్ కి తాప్సి కౌంటర్ ఇచ్చింది.

"నేను ముంబైలో ఉన్నప్పటికీ ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. నా ఆదాయపు పన్ను కూడా ఢిల్లీకె వెళుతోంది. చాలా మంది ఆ విషయాల్లో కంట్రిబ్యూటీ చేయకుండా ఉంటున్నారు. వారికంటే నేను చాలా బెటర్. నా పౌరస్వత్వం గురించి ప్రశ్నించకుండా మీరు ఎంత సహకారం చేస్తున్నారు అనే విషయంపై ఏకాగ్రత వహించండి" అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?