సల్మాన్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫైనల్ గా ఈ టైటిల్ కే గ్రీన్ సిగ్నల్

prashanth musti   | Asianet News
Published : Feb 08, 2020, 07:38 PM IST
సల్మాన్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫైనల్ గా ఈ టైటిల్ కే గ్రీన్ సిగ్నల్

సారాంశం

టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే టైటిల్ మీద ఎక్కువ తర్జన భర్జనలు పడుతూంటారు దర్శక,నిర్మాతలు. ప్రభాస్ తాజా సినిమా కోసం టైటిల్ వేట గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే తమ కోసం అనుకున్న జాను టైటిల్ ని దిల్ రాజు కు ఇచ్చేయటంతో ప్రభాస్ సినిమాకు కు వేరే టైటిల్ వెతకాల్సిన పరిస్దితి ఏర్పడింది.

సినిమాకు టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే టైటిల్ మీద ఎక్కువ తర్జన భర్జనలు పడుతూంటారు దర్శక,నిర్మాతలు. ప్రభాస్ తాజా సినిమా కోసం టైటిల్ వేట గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే తమ కోసం అనుకున్న జాను టైటిల్ ని దిల్ రాజు కు ఇచ్చేయటంతో ప్రభాస్ సినిమాకు కు వేరే టైటిల్ వెతకాల్సిన పరిస్దితి ఏర్పడింది.

అందుకోసం తాజాగా రెండు టైటిల్స్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం.  అయితే ఈ రెండు టైటిల్స్ లో ప్రభాస్..రాధే శ్యామ్ అనే టైటిల్ కు ఓటేసినట్లు సమాచారం.  అందుకు కారణం సల్మాన్ ఖాన్ అని చెప్తున్నారు. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి రాధే అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ నార్త్ లో బాగా పాపులర్ అయ్యింది. దాంతో రాధే శ్యామ్ అనే టైటిల్ పెడితే అక్కడ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యే అవకాసం ఉందని ప్రభాస్ భావిస్తున్నాడట.

అయితే ఈ టైటిల్ మనకు ఏదో హిందీ టైటిల్ విన్న ఫీలింగ్ వచ్చే అవకాసం ఉంది.     ప్రభాస్ హీరోగా తమ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు ఒక భాగస్వామిగా వున్నారు. ఈ ప్రాజెక్టుకి మొదటినుంచీ 'జాను' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అయితే శర్వానంద్, సమంత కాంబినేషన్ లో ఈ రోజు రిలీజైన చిత్రానికి  ఆ టైటిల్ ఇచ్చేయటం జరిగింది.

దిల్ రాజు ఈ విషయాన్ని చెప్తూ, ప్రభాస్ కు ధాంక్స్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు తాజాగా 'ఓ డియర్' .. 'రాధేశ్యామ్' అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.   ప్రభాస్ .. పూజా హెగ్డే చేస్తున్న ఈ చిత్రం ప్రేమకథాంశం కావడం వలన, ఈ సినిమా కోసమే ఆ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే దీనిలో దేనికి రెస్పాన్స్ బాగా వస్తే దాన్ని ఫైనలైజ్ చేస్తారంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?