మహేష్ బాబు పేరు కలిసేలా కొడుక్కి నామకరణం చేసిన అనిల్ రావిపూడి

Published : Apr 12, 2020, 01:43 PM IST
మహేష్ బాబు పేరు కలిసేలా కొడుక్కి నామకరణం చేసిన అనిల్ రావిపూడి

సారాంశం

దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అనిల్ రావిపూడి చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. 

ఈ చిత్రం అనిల్ రావిపూడికి ఓ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ చిత్రం ఘనవిజయం సాధించడం మాత్రమే కాదు.. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక రోజునఅనిల్ రావిపూడి తండ్రయ్యాడు. అనిల్ రావిపూడి సతీమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

ఈ హీరోయిన్లంతా ఏమయ్యారు.. సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు

ఇటీవల అనిల్ రావిపూడి తన కుమారుడికి నామకరణం చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ పాత్ర పేరు అజయ్. ఆ పేరు కలసి వచ్చేలా తన కొడుక్కి అజయ్ సూర్యాన్ష్ అని నామకరణం చేసినట్లు అనిల్ తెలిపాడు. 

అనిల్ రావిపూడి తదుపరి ఎఫ్3 చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?