'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' చిత్రానికి జగన్ ప్రభుత్వం షాక్.. సెన్సార్ బోర్డుకు లేఖ!

By tirumala ANFirst Published Nov 28, 2019, 9:49 PM IST
Highlights

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాంగోపాల్ వర్మ ఓ వర్గాన్ని టార్గెట్ చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాంగోపాల్ వర్మ ఓ వర్గాన్ని టార్గెట్ చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఈ చిత్ర టైటిల్ పై కూడా విమర్శలు అధికం అవుతున్నాయి. 

రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా టైటిల్ ఉందని అంతా భావిస్తున్నారు. అనేక వివాదల నేపథ్యంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్ర విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికెట్ కూడా జారీ చేయలేదు. దీనితో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. 

ఈ చిత్రంపై సమగ్రంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సెన్సార్ బోర్డుని ఆదేశించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా రాంగోపాల్ వర్మ చిత్రానికి ఝలక్ ఇవ్వడం విశేషం. కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్ర టైటిల్ మార్చాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. 

వైఎస్ జగన్ బయోపిక్.. రూ.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న వర్మ!

రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టెలా టైటిల్ పెట్టడం సరికాదు. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి టైటిల్స్ ని ప్రోత్సహించకూడదు. ఈ చిత్ర టైటిల్ మార్చేలా సెన్సార్ బోర్డు దర్శకుడు, నిర్మాతలకు ఆదేశాలు ఇవ్వాలని సజ్జల తన లేఖలో పేర్కొన్నారు. 

అల్లు ఫ్యామిలీ వాడకం మామూలుగా లేదుగా.. ఈసారి వరుణ్ తేజ్!

ఈ చిత్రంలో వర్మ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ లాంటి ఇతర రాజకీయ నాయకులని వెటకారంగా చూపించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రంలో పాత్రలకు రాజకీయ నాయకులకు సంబంధం లేదని వర్మ అంటున్నాడు. మొత్తంగా వర్మ తెరకెక్కించిన ఈ కాంట్రవర్సీ చిత్ర భవితవ్యం సెన్సార్ బోర్డు, హైకోర్టు చేతుల్లో ఉంది. 

click me!