'అమృతం 2' వెబ్ సిరీస్.. అంజిగా ఎవరంటే..?

Published : Jan 09, 2020, 11:05 AM ISTUpdated : Jan 09, 2020, 11:50 AM IST
'అమృతం 2' వెబ్ సిరీస్.. అంజిగా ఎవరంటే..?

సారాంశం

'అమృతం' సీరియల్ ఎపిసోడ్ లు అన్నింటినీ జీ-5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కొనేసింది. జీ యాప్ లో మాత్రమే సీరియల్ ని చూసే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇప్పుడు 'అమృతం 2' అంటూ ఓ వెబ్ సిరీస్ ని తయారు చేసే పనిలో పడింది. మళ్లీ గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయ్యారు. 

90వ దశకంలో పిల్లలంతా పడి పడి చూసిన సీరియల్ 'అమృతం'. అప్పట్లో టీవీలో ఈ కామెడీ సీరియల్ ఓ మోత మోగించింది. ఆ తరువాత యూట్యూబ్ లో ఈ సీరియల్ ను పార్ట్ లుగా ప్రసారం చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఉన్నట్లుండి 'అమృతం' ఎపిసోడ్ లు యూట్యూబ్ లో మాయమయ్యాయి.

దీనికి వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. 'అమృతం' సీరియల్ ఎపిసోడ్ లు అన్నింటినీ జీ-5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కొనేసింది. జీ యాప్ లో మాత్రమే సీరియల్ ని చూసే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇప్పుడు 'అమృతం 2' అంటూ ఓ వెబ్ సిరీస్ ని తయారు చేసే పనిలో పడింది.

మహేష్ పక్కన రష్మిక పనికి రాదన్నారు.. డైరెక్టర్ కామెంట్స్!

మళ్లీ గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయ్యారు. సీరియల్ లో మాదిరి ఈ వెబ్ సిరీస్ లో అమృతం, అంజి, సర్వర్ ఇలా అన్ని క్యారెక్టర్లు మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. కానీ అంజి క్యారెక్టర్ లో నటించిన గుండు హనుమంతరావు జీవించిలేరు. మిగిలినవారు చాలా మంది 'అమృతం 2'లో కూడా కంటిన్యూ అవుతారు.

అంజిగా మాత్రం సీనియర్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. కామెడీ పాత్రలతో సినిమాల్లో ఫేమస్ అయిన ఎల్ బి శ్రీరామ్ ఆ తరువాత సీరియస్ తరహా పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు. మళ్లీ ఇంతకాలానికి కామెడీని పండించే ఓ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?