చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

By tirumala AN  |  First Published Jan 6, 2020, 11:48 PM IST

స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.


స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోకి అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. 

అల్లు అర్జున్ సరదాగా తన ప్రసంగాన్ని ప్రారంభించి ఎమోషనల్ గా ముగించారు. తమన్ ఈ చిత్రంతో గౌరవాన్ని పెంచుకున్నాడు. అతడికి ఇంతకంటే మంచి ప్రశంస ఇవ్వలేను. సామజవరగమన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అసలు ఊహించలేదని అల్లు అర్జున్ అన్నారు. 

Latest Videos

undefined

తన కుమార్తె చేసిన దోసె స్టెప్పు గురించి అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. ఓ రోజు నా కూతురు షూటింగ్ కి వచ్చింది. ఇంటికి వెళ్ళాక నాన్న ఏం చేశారు షూటింగ్ లో అని నా భార్య అడిగింది. ఏం చేయలేదు.. షర్ట్ సరిగ్గా వేసుకోకుండా దోసెలు వేశాడు అని తన పరువు తీసేసినట్లు బన్నీ సరదాగా మాట్లాడాడు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ.. ఆయనతో ఇది మూడో చిత్రం. నా చివరి 10 చిత్రాల్లో మూడు సినిమాలు ఆయన దర్శత్వంలోనే చేశా. దేనిని బట్టే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ అంటే నాకు ఎంత ఇష్టమో అని బన్నీ తెలిపాడు. 

ఇక తన ప్రసంగం చివర్లో అల్లు అల్లు అర్జున్ ఊహించని విధంగా ఎమోషనల్ అయిపోయాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ కంటతడి పెట్టుకున్నాడు. తొలిసారి అల్లు అర్జున్ ఎమోషనల్ గా మాట్లాడడంతో అభిమానులు కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. మా నాన్నకు థాంక్స్ చెప్పుకునే అవకాశం ఇంత వరకు రాలేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నా. నాకు కొడుకు పుట్టాక తెలిసింది.. నేను మా నాన్న అంతటి గొప్పోడిని ఇంకా కాలేదు అని. అల్లు అర్జున్ కంటతడి పెట్టుకుంటుండడంతో వేదిక కింద ఉన్న అల్లు అరవింద్ పరిగెత్తుకుని వచ్చి బన్నీని కౌగిలించుకున్నాడు. 

త్రివిక్రమ్ చెప్పింది చాలా చిన్న కథ.. అల్లు అరవింద్!

ఈ దృశ్యాలు అభిమానులని కూడా ఎమోషన్ కు గురుచేశాయి. చాలా మంది మా నాన్న డబ్బు కొట్టేశారు అని మాట్లాడుతుంటారు. అది తప్పు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన కష్టపడి ఎదిగారు ఇండియాలో ఒక గొప్ప నిర్మాత. పద్మశ్రీ అవార్డుకు మా నాన్న అన్ని విధాలా అర్హుడు. మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు బన్నీ తెలిపాడు. 

ఈ సినిమాకి మొదలు, చివర రెండూ అల్లు అర్జునే : త్రివిక్రమ్

నా అభిమానుల వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. అందరికి అభిమానులు ఉంటారు.. నాకు మాత్రం ఆర్మీ ఉందని బన్నీ గట్టిగా అరిచాడు. చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అరుస్తున్నారు. కానీ నేను మాత్రం కట్టె కాలేవరకు చిరంజీవి గారి అభిమానినే అని బన్నీ తెలిపాడు. మహేష్ బాబు గారు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే దర్బార్, ఎంత మంచి వాడవురా చిత్ర యూనిట్స్ కి కూడా బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. 

click me!