'రాములో రాములా' సాంగ్.. గొంతు కలిపిన స్టైలిష్ స్టార్!

By AN Telugu  |  First Published Oct 26, 2019, 12:42 PM IST

'రాములో రాములా' టీజర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఒక్క టీజర్ తో ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగడం మామూలు విషయం కాదు. ఈరోజు పూర్తి పాటని విడుదల చేయనున్నారు. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇప్పటినుండే సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల సినిమాలో 'సామజవరగమన' అనే పాటను విడుదల చేశారు. 

సిద్ శ్రీరాం పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో పాట 'రాములో రాములా' టీజర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఒక్క టీజర్ తో ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగడం మామూలు విషయం కాదు. ఈరోజు పూర్తి పాటని విడుదల చేయనున్నారు.

Latest Videos

బన్నీ సెంటిమెంట్ లుక్.. టీజర్ లో గట్టిగా వాడేశాడు!

మంచి మాస్ బీట్స్ తో ఈ పాట సాగుతుందని ముందే అర్ధమైంది. ఇప్పుడు ఈ పాటకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ తోడైంది. ఈ పాటలో బన్నీ గొంతు కూడా వినిపిస్తుంది. బన్నీ మాటలతో ఈ పాట మొదలుకానుంది.

ఈరోజు సాయంత్రం విడుదలయ్యే పాటలో బన్నీ గొంతు కూడా వినొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి హీరోలతో పాటలు పాడించే అలవాటు ఉంది. ఇప్పుడు బన్నీతో కూడా హమ్ చేయించి తన సరదా తీర్చుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

click me!