దేవరకొండ స్ట్రాటజీలు.. వర్కవుట్ అవుతాయా..?

By AN TeluguFirst Published Oct 26, 2019, 11:55 AM IST
Highlights

న్యూఏజ్ మార్కెటింగ్ ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంతో విజయ్ మార్కెటింగ్ కూడా ఉపయోగపడింది. 

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తన సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఫాలో అయ్యే మార్కెటింగ్ స్ట్రాటజీలు, ప్రమోషన్స్ మరెవరికీ సాధ్యం కావు. న్యూఏజ్ మార్కెటింగ్ ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంతో విజయ్ మార్కెటింగ్ కూడా 
ఉపయోగపడింది.

అలాగే ఫ్లాప్ అయిన 'నోటా', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలకు కూడా తొలిరోజు భారీ వసూళ్లు వచ్చాయంటే దానికి కారణం విజయ్ దేవరకొండే.. తన స్టైల్, ఫ్యాషన్ సెన్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ లో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. తన తొలి నిర్మాణం 'మీకు మాత్రమే చెప్తా'కి కూడా చిత్రమైన మార్కెటింగ్ చేస్తున్నాడు.

మహేష్ సినిమాలో పీవీపీకి వాటా.. ఎంతంటే..?

కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన చిన్న చిత్రమైనప్పటికీ దీనికి విజయ్ ఇప్పటికే బజ్ అయితే తీసుకురాగలిగాడు . మరి ఈ చిత్రానికి ప్రేక్షకులు థియేటర్లకి కదిలి వస్తారా..? లేదా..? అనేది చూడాలి. చిన్న సినిమా కనుక మంచి టాక్ వచ్చినట్లయితే కచ్చితంగా వీకెండ్ లో వసూళ్లు బాగా వస్తాయి. వచ్చేవారం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొస్తుంది.

ఈ సినిమాకి వచ్చే స్పందనని బట్టి ఇకపై నిర్మాణం విషయంలో ఎంత సీరియస్ గా ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తాడు దేవరకొండ. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని హీరోగా నిలబెట్టడానికి ఈ నిర్మాణ సంస్థ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ప్రస్తుతం విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!