బోల్డ్ కంటెంట్ ఉంటుంది.. చిన్న పిల్లలకు చూపించొద్దు: అల్లు అరవింద్

By tirumala AN  |  First Published Feb 9, 2020, 4:48 PM IST

డిజిటల్ యుగం పెరుగుతున్న కొద్దీ నిర్మాతకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు డిజిటల్, వెబ్ మీడియాలో కూడా సినిమా దూసుకుపోతోంది. థియేటర్స్ లో విడుదలైన కొన్నిరోజులకే డిజిటల్ మీడియాలో సినిమాలు వచేస్తున్నాయి. అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాకు డిమాండ్ పెరుగుతోంది. 

రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుండడంతో బడా నిర్మాత అల్లు అరవింద్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. OTT రంగంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఈ సంధర్భంగా అల్లు అరవింద్ 'ఆహా' అనే యాప్ లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రోజు ఈ యాప్ ప్రివ్యూ జరిగింది. 

Latest Videos

undefined

పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ యాప్ ని తెలుగు వారికోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. దాదాపు 8 నెలలపాటు శ్రమించి ఈ యాప్ ని సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఉగాది రోజున గ్రాండ్ గా ఆహా యాప్ ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

నడుము సొగసుతో మంటపెడుతున్న అనసూయ.. సెక్సీ ఫోజులతో రచ్చ

ప్రస్తుతం ప్రతిఒక్కరూ మొబైల్ ఉపయోగిస్తున్నారు.  దాదాపు 25 షోలు ఈ యాప్ లో ఉండబోతున్నాయి. అందులో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి తల్లి దండ్రులు తమ పిల్లలని గమనిస్తూ ఉండాలి. మొబైల్స్ ని తమ కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అల్లు అరవింద్ హెచ్చరించారు. అడల్ట్ కంటెంట్ తో షోలు ఉంటాయి కాబట్టి తల్లి దండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ యాప్ ని ఉపయోగించాలి అని అల్లు అరవింద్ అన్నారు. 

40 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

click me!