
ఇప్పుడు అందరి దృష్టీ ఆదిపురుష్ చిత్రంపైనే ఉంది. ఈ చిత్రం ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అవ్వగానే దాని ఆల్ ఓవర్ ఇండియాలో.. ఆదిపురుష్ ని ఫాలో అవుతున్న విధానం చూస్తే.. ఈ సినిమా ఏ మాత్రం బాగున్నా సెన్సేషన్ క్రియేట్ అవుతుందనిపిస్తోంది. అదే విధంగా సినిమా ఓపెనింగ్స్ చాలా గట్టిగా అదిరిపోయే లెవెల్ లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అదే క్రమంలో ఈ సినిమాని మంచి రేట్లకే అమ్మారు. బాహుబలి తర్వాత ( ప్రభాస్ రెండు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగానే నష్టపోయారు. అందుకని ఈ సినిమా విషయంలో ఎక్కువ పెట్టి కొనడానికి మొదట చాలా వరకు భయపడ్డారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా బిజినెస్ ఓ రేంజిలో ఉంది. సినిమాపై నెగెటివిటీ పోయి పాజిటివ్ వచ్చి బిజినెస్ అదిరిపోతోంది.
ఈ క్రమంలో #Adipurush నైజాం గ్రాస్ టార్గెట్ 100 కోట్లు
ఆంధ్ర గ్రాస్ టార్గెట్ 120 కోట్లు గా ఫిక్సైంది.
ఇక సినిమా సూపర్ హిట్ అయ్యి..ఈ రెండు గనుక జరిగితే...ఈ ఫీట్ సాధ్యమైతే ప్రభాస్ తర్వాత సినిమా #Salaarబిజినెస్ లెక్కలు, అంకెలు అందనంత ఎత్తుకు మారిపోతాయనేది నిజం. రిలీజ్ రోజు జూన్ 16 తేదీన దాదాపు 80% సినిమా హాల్స్ లో కేవలం ఈ ఒక్క సినిమానే వేసే అవకాసం ఉంది. 80% సినిమా హాల్స్ లో ఆదిపురుష్ సినిమా మాత్రమే వస్తే కలక్షన్ లెక్కలు మైండ్ బ్లోయింగ్ సెన్సేషన్ అవుతాయి.
ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక వీకెండ్ రెండు రోజులు ఇంకో 200 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఆదిపురుష్ లాభాల బాట కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.
ప్రభాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్.. హీరోయిజాన్ని గొప్పగా ఎలివేట్ చేస్తూ పవర్ ప్యాక్డ్ కె.జి.యఫ్ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్న నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతున్నట్లు నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై మేకర్స్ స్పందించారు. సలార్ సినిమాను అనౌన్స్ చేసినట్లు సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయబోతున్నట్లు వారు మరోసారి స్పష్టం చేశారు.
భారీ అంచనాల నడుమ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ చేస్తోన్న మూవీ. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ఈ చిత్రంలో విలన్స్‌గా కనిపించబోతున్నారు.