అడవిలో అమలాపాల్ కష్టాలు.. మరి బయటపడుతుందా..?

Published : Nov 14, 2019, 03:18 PM ISTUpdated : Nov 14, 2019, 03:46 PM IST
అడవిలో అమలాపాల్ కష్టాలు.. మరి బయటపడుతుందా..?

సారాంశం

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో దర్శకుడు ఎఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. దీంతో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మలయాళ నటి అమలాపాల్.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. అయితే తన కెరీర్ మాత్రం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. బిగ్రేడ్ ఫిలింతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత విజయ్, సూర్య, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది.

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో దర్శకుడు ఎఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. దీంతో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలో ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు టర్న్ తీసుకుంది.

బీష్మ బజ్.. బంపర్ అఫర్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్

ఈ క్రమంలో ఆమె 'ఆడై' అనే సినిమాలో నటించింది. తెలుగులో 'ఆమె' పేరుతో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ మాత్రం వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో అమలాపాల్ ఎంతో బోల్డ్ గా, న్యూడ్ గా కనిపించి షాక్ ఇచింది. రెమ్యునరేషన్ సంగతి కూడా పక్కన పెట్టి సినిమాలో నటిస్తే.. సినిమాకి సరైన ఫలితం దక్కలేదు.

మరొకరైతేమళ్లీ ఇలాంటి సాహసాలు చేయడానికి ముందుకురారు. కానీ అమలాపాల్ మాత్రం మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే 'అదో అంద పార్వై పోల' చిత్రం. ఈ సినిమాలో అమలాపాల్ కి నిర్మాణ భాగస్వామ్యం ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

టీజర్ ని బట్టి సినిమా సాహసోపేతమైన కథగా అనిపిస్తోంది. దట్టమైన అడవిలో కొందరు మానవ మృగాల మధ్య చిక్కుకున్న అమ్మాయి వారి నుండి ఎలా తప్పించుకొని బయట పడుతుందనేది కథ. పూర్తిగా అడ్వెంచరస్ గా సాగే ఈ సినిమా కోసం అమలా బోల్డ్ గా నటించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?