అల్లు అర్జున్ చెప్పేవరకు ఆ హీరోలిద్దరి గురించి నాకు తెలియదు.. శ్రీవిష్ణు!

Published : Nov 14, 2019, 03:00 PM ISTUpdated : Nov 14, 2019, 03:25 PM IST
అల్లు అర్జున్ చెప్పేవరకు ఆ హీరోలిద్దరి గురించి నాకు తెలియదు.. శ్రీవిష్ణు!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరో. బన్నీ క్రేజ్ కేవలం తెలుగులు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా మలయాళీ చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. కేరళలో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా యువ హీరో శ్రీవిష్ణు ఇటీవల 'తిప్పరా మీసం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన శ్రీవిష్ణు ప్రస్తుతం సోలో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ లో విడుదలైన బ్రోచేవారెవరురా చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి శ్రీవిష్ణు తిప్పరా మీసం చిత్రంతో ప్రేక్షకులని అలరించాడు. 

శ్రీవిష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీవిష్ణు బన్నీతో కలసి సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు. 

సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందుగానే బన్నీ నేను నటించిన ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాన్ని చూశాడు. నా నటనకు ప్రశంసలు తెలిపాడు. అదేవిధంగా నేను కమర్షియల్ చిత్రాలతో పాటు, విభిన్నమైన చిత్రాల్లో కూడానా నటించాలని బన్నీ ప్రోత్సహించాడు. నాకంటూ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ చేసుకోమని చెప్పాడు. అందుకోసం నాకు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ లని ఉదాహరణగా చెప్పాడు. 

అప్పటికి విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ కెరీర్ ఆరంభంలోనే ఉంది. బన్నీ చెప్పేవరకు వారిద్దరూ ఎవరో నాకు తెలియదు. బన్నీ చెప్పాక వారిద్దరిని ఫాలో కావడం ఆరంభించా. అది తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని శ్రీవిష్ణు తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?