హాస్పిటల్ లో చేరనున్న కమల్ హాసన్..!

Published : Nov 21, 2019, 01:58 PM ISTUpdated : Nov 21, 2019, 02:00 PM IST
హాస్పిటల్ లో చేరనున్న కమల్ హాసన్..!

సారాంశం

 వైద్యుల సలహా మేరకు నవంబర్ 22న కమల్ హాసన్ దీనికోసం హాస్పిటల్ లో చేరనున్నారని వెల్లడించారు.

ప్రముఖ కోలీవుడ్ నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరనున్నట్లు సమాచారం. ఆయన కాలులో ఉన్న ఇంప్లాంట్ ని తొలగించడానికి వైద్యులు శుక్రవారం ఆయనకి శస్త్రచికిత్స చేయనున్నారు. 

స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోన్న సమంత..!

ఈ క్రమంలో ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటనని విడుదల చేసింది. 2016లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినప్పుడు వైద్యులు ఇంప్లాంట్ ని అమర్చారని, దీని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియని వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్ఎన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వైద్యుల సలహా మేరకు నవంబర్ 22న కమల్ హాసన్ దీనికోసం హాస్పిటల్ లో చేరనున్నారని వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన తరువాత ఆయన కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిఉంటుందని మహేంద్రన్ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?