పచ్చి అబద్ధాలు, నేనేంటో ఇండస్ట్రీకి తెలుసు: డ్రైవర్ వ్యాఖ్యలపై ముమైత్ స్పందన

Siva Kodati |  
Published : Oct 01, 2020, 08:26 PM ISTUpdated : Oct 01, 2020, 11:32 PM IST
పచ్చి అబద్ధాలు, నేనేంటో ఇండస్ట్రీకి తెలుసు: డ్రైవర్ వ్యాఖ్యలపై ముమైత్ స్పందన

సారాంశం

గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సినీనటి ముమైత్ ఖాన్ స్పందించారు. క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపణలను ఆమె ఖండించారు. గోవా ట్రిప్‌లో తాను పూర్తిగా డబ్బులు చెల్లించనని ముమైత్ ఖాన్ వెల్లడించారు

గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సినీనటి ముమైత్ ఖాన్ స్పందించారు. క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపణలను ఆమె ఖండించారు. గోవా ట్రిప్‌లో తాను పూర్తిగా డబ్బులు చెల్లించనని ముమైత్ ఖాన్ వెల్లడించారు.

డ్రైవర్ రాజు నుంచి తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్ రాజు తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. అతను చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని చెప్పింది ముమైత్.

ర్యాష్ డ్రైవింగ్ చేసి భయాందోళనలకు గురిచేశాడని చెప్పుకొచ్చింది ముమైత్. డబ్బులు చెల్లించకుండా మోసం చేశాననడం కరెక్ట్ కాదంది ముమైత్ ఖాన్. రాజుపై పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.

12 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నానని... తన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసునని ముమైత్ వెల్లడించింది. ఫ్లైట్‌లో పెట్స్‌కు అనుమతి లేకపోవడంతో క్యాబ్‌లో గోవాకు వెళ్లానని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?