కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

Published : Dec 04, 2019, 02:25 PM ISTUpdated : Dec 04, 2019, 02:42 PM IST
కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

సారాంశం

జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తలైవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. 

సౌత్ ఇండస్ట్రీలో జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తలైవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

ఎంజీఆర్ గా అరవింద్ స్వామి నటిస్తుండగా ప్రియామణి శశికళ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. ఇకపోతే నెక్స్ట్ మరో స్టార్ హీరో సినిమాలో కనిపించబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విజయ్ దేవరకొండను తలైవి చిత్ర యూనిట్ ఇటీవల ఒక పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. జయలలిత జీవితంలో శోభన్ బాబు పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అందుకే ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు సమాచారం.

అయితే అఫర్ పై విజయ్ ఏ విధంగా స్పందించాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి తైలవి బయోపిక్ లో నటించడానికి విజయ్ ఒప్పుకున్నాడా? అనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఎఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తైలవి సినిమా కథను బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రచించారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?