undefined
తెలంగాణా ఏర్పాటు అయి మూడేళ్లు కావస్తా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన మంత్రి వర్గంలో1969 ఉద్యమ కారులనుంచి, తొలి, మలి విడత ఉద్యమ కారులు దాకా ఉన్నారు.
చెప్పేదేమిటంటే, ఇంతమంది ఉన్నా తెలంగాణా రాష్ట్ర గీతం లేకుండానే చరిత్ర సాగుతూ ఊంది.పాఠ్యపుస్తకాలూ చరిత్ర గ్రంధాలూ రాష్ట్ర గీతం లేకుండానే వస్తున్నాయి.
ఉద్యమ కాలంలో ఉూరూర వాడవాడ జనపదమై మారుమ్రోగిన ‘జయ జయహే తెలంగాణ’ పాట రాష్ట్ర గీతం అవుతుందనే అపారమైన నమ్మకంతో కొన్ని పాఠ్యపుస్తకాల్లో దాన్ని ప్రచురించారు కూడా.
ముఖ్యమంత్రి సిఆర్ చుట్టూ ఉన్న బ్రాహ్మణ లాబీ దళిత కవి అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ పాట' రాష్ట్ర గీతం కాకుండా అడ్డుకున్నారనే వాదన వినిపిస్తోంది.
ఈ రాష్ట్ర అవతరణ రోజు ఆ పాట పాడ కూడదు అని సంకేతాలు కూడా ఇచ్చారట.
ఏమో మీ పిచ్చి గానీ అసలు పాట, రాత , ఆట ఎవరి సొత్తు ? మట్టి పిసికి, నీరు పోసి ,నారు నాటి, చర్మం వలిసి, డప్పు మూసి, కాలికి గజ్జకట్టి, నదులకు డాములు కట్టి, కస్వు ఊడ్చి, కంప గొట్టి ఇన్ని పనులు చేసి తొలి దశ మలిదశ పోరాటం లో డప్పు కొట్టి , కేసులు కొట్లాటలు, బలిదానాలు సకల - సబ్బండ కులాలు పోరాడి తెచ్చిన తెలంగాణా కు నిట్టాడై నిలిచిన చైతన్యంతో, 'వేల పుస్తకాలు' చదివిన జ్ఞానం తో సమస్త వనరులను మచ్చిక చేసుకున్న 'జంధ్యం' పాట రాయాలి, అది రాష్ట్ర గీతం కావాలి. అంతేనా...
అలగా జనాలు రాసిన 'జయ జయ హే తెలంగాణ' ఉత్తి లల్లాయి పాట .
ఒక్కొక్కన్ని గోడ కుర్చీ వేయించి పాట మర్చి పోయేలా ఆజ్ఞ వేయాలి. ఒక సకల కళా వల్లభుడు. నిగర్వి, చతుర్వేది, నిష్కామ నిస్టునితో, మంత్రోచ్చారణల మధ్య యదాద్రి లో హోమాలు వేసి తెలంగాణా జాతీయ గీతం రాయించాలి .
అవును ‘జయ జయ హే తెలంగాణా’ ను తెలంగాణా ప్రజల మట్టి బుర్రల్లోంచి తొలగించాలి.
నడుం బిగించండి.