ఇలా చేస్తే ఆంధ్రాకి నోబెల్ ప్రైజ్ గ్యారంటీ

 |  First Published Jan 5, 2017, 4:09 AM IST

 

Latest Videos

undefined

 

 

 

కోళ్ల ఫారాల్లాంటి కాలేజీలు...labs,practicals అసలే ఉండవు...ఆ ఇంటర్ పరీక్షలకు రెండు నెల్ల ముందు practicals jumbling అంటారు..ఆ తర్వాత ఎన్ని కోట్లు ఆ శాఖ మంత్రికి ముడుతాయో తెలియదు,యధాప్రకారమే పరీక్షలు...ఏదైతేనేం..IIT,AIIMS లో సీట్లు కొట్టేస్తున్నారు...ఆ తర్వాత సంగతి నాకు తెలియదు...

 

ఆ India Science congress లో నోబెల్ తెస్తే 100 కోట్లు ఇస్తా అని బాబు ఉవాచ....అసలు scientific temper అనేదొకటి ఏడ్చిందా మనకు...

 

పొద్దున లేచింది మొదలు...మొదటి తలమార్పిడి వైద్యం... మన దక్షుడు(మేకతల),గణపతి(ఏనుగు తల)...

మొదటి మానసికవ్యాధి నిపుణుడు... కృష్ణుడు..డిప్రెషన్ లో అర్జునుడికి చికిత్స చేసాడు...

మొదటి వైద్యులు...అశ్వినీ దేవతలు..చరక,శుశ్రుతులు...

మొదటి విమానం..పుష్పకవిమానం...ఎందరెక్కినా ఇంకో సీటు మిగిలుతుంది..

మొదటి అణ్వస్త్రాలు...మన భారత యుద్ధంలోని అస్త్రాలు...

మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి...ద్రోణుడు,కౌరవులు...

ఇప్పుడు stem cell therapy ఇంకా umbilical cord అంటూ గోల పెడుతున్నారు కానీ అసలు బ్రహ్మ పుట్టిందే బొడ్డుతాడు నుంచి....

ఒకటా రెండా.....ఇంటా బయటా..టీవీ ప్రవచనకారులు ఊదరగొడుతున్నారు...

------ఇక బాబు గారి బహుమానం విషయానికొస్తే....

ఉదయం నుంచి  ఆవేశ పడి కొందరు పోస్టులు పెడుతున్నారు....

ఏ రాజకీయనాయకుడికైనా ప్రజల మతిమరుపే పెద్ద వరం...

 

అప్పట్లో మన బాబు గారు National Games జరిపించారు..పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం...ఏముందీ? నానా రాష్ట్రాలోల్లనుంచి కొనుక్కొచ్చి మన రాష్ట్రం తరపున ఆడించారు...ఏమన్నా అంటే ఒలంపిక్స్ లో అమెరికా చెయ్యడం లేదా అన్న బుకాయింపు....

 

ఇప్పుడూ ఆ పనే చేస్తే సరిపోదా?ఆ పురస్కారం వచ్చినోళ్లకు మనకు బీరకాయపీచు సంబంధం కనిపెట్టలేమా? అవసరమయితే స్విస్ ఛాలెంజ్ పధ్దతిలో  క్యాండిడేట్స్  ఎంపిక చేయవచ్చు.

 

అసలామధ్య చూడండి శ్రీకృష్ణ దేవరాయల 500 పట్టాభిషేక ఉత్సవాలు జరుపుకునే వేళ...కొందరు ఆయన మావాడంటే మావాడని పేపర్లకెక్కి తిట్టుకున్నారు...ఇటీవలే మరో పెద్దాయన మావాడంటూ మరో వాదం తెరపైకి తెచ్చాడు...

 

కృష్ణరాయలైనా కావొచ్చు,గౌతమీపుత్ర శాతకర్ణి కావచ్చు...వాళ్ల ప్రాంతమేదో,మాతృభాషేదో తెలియకున్నా మన ఖాతాలో వేసుకుంటే సరి...

 

కోడి ఎవరిదో,ఎక్కడ తిరిగితే ఏం...గుడ్డు మా ఇంట్లో పెట్టిందనుకుంటే సరి...  

 

click me!