వానలొస్తే ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీ ఇలా ఉంటుంది

Asianet News Telugu  
Published : Oct 12, 2017, 06:10 PM ISTUpdated : Mar 28, 2018, 04:58 PM IST
వానలొస్తే ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీ ఇలా ఉంటుంది

సారాంశం

కడప జిల్లాలో ప్రొద్దుటూరు పెద్ద ఊరు. బంగార వ్యాపారంలో సెకండ్ బాంబే అని పేరు. జవుళి వ్యాపారంలో తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద మార్కెట్.  అయితే, ఈ ఊరు బాగు చేద్దామని ఎపుడూ ఏ ప్రభుత్వం అనుకోలేదు. ఈ వూర్లోని  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి దీనికి  సాక్ష్యం. వర్షం వస్తే చాలు, కాలేజీ ఆవరణ ఒక రిజర్వాయర్ అవుతుంది.

ఇపుడు కురుస్తున్న వర్షాల వల్ల కాలేజీ ఎలా ఉందో ఈ ఫోటోలు చెబుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఏర్పడుతున్న  దీనికొక శాశ్వత పరిష్కార మార్గాలను చూపలేకపోతున్నారు.వానలొచ్చినపుడల్లా అక్కడ చదువుతున్న విద్యార్థులు ఈ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదురుకొంటున్నారు. అయినా కూడ ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా బాధాకరం. 
ఇవాళ కళాశాల యజమాన్యాన్ని కలిసి అక్కడ ఉన్న పరిస్థితి మీద స్పందన అడిగాం. ‘ ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం.  చేస్తాంలే అని అంటున్నారు తప్ప చేయటం లేదు"" అని ప్రభుత్వ కళాశాల  అధికారులు చెబుతున్నారు.

 


ప్రభుత్వ పెద్దలకు నా విజ్ఞప్తి, అయ్యా ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చాలా శిథిలావస్థకు చేరుకుంది. మీరు ఇలానే ఇంకా ఆలస్యం చేస్తే బాధాకరమయిన సంఘటనలు జరిగే అవకాశం వుంది కావున వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కళాశాల సమస్యను పరిష్కరించాలని  ప్రజల తరఫున కోరుతున్నాను.
అలాగే వర్షం నీరు అవరణలో నిలవకుండా చేసి విద్యార్థులు అవస్థలు పడకుండా చూడాలని విజ్ఞప్తి.

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?